Asianet News TeluguAsianet News Telugu

ఎడ్ టెక్ కంపెనీలతో జాగ్రత్త.. ఈ మార్గదర్శకాలు ఫాలో అవ్వండి

విద్యలో సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ఎన్నో టెక్ కంపెనీలు ఆన్‌లైన్ మోడ్‌లో కోర్సులు, ట్యూటోరియల్స్, పోటీ పరీక్షల కోచింగ్‌ మొదలైన వాటిని అందించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అనేక ఎడ్ టెక్ కంపెనీలు అందించే ఆన్‌లైన్ కంటెంట్, కోచింగ్‌లను ఎంచుకోవడాన్ని నిర్ణయించేటప్పుడు తల్లిదండ్రులు, విద్యార్ధులు జాగ్రత్తగా వుండాలి.

Advisory to citizens regarding use of caution against Ed-tech Companies
Author
New Delhi, First Published Dec 23, 2021, 8:34 PM IST

విద్యలో సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ఎన్నో టెక్ కంపెనీలు ఆన్‌లైన్ మోడ్‌లో కోర్సులు, ట్యూటోరియల్స్, పోటీ పరీక్షల కోచింగ్‌ మొదలైన వాటిని అందించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అనేక ఎడ్ టెక్ కంపెనీలు అందించే ఆన్‌లైన్ కంటెంట్, కోచింగ్‌లను ఎంచుకోవడాన్ని నిర్ణయించేటప్పుడు తల్లిదండ్రులు, విద్యార్ధులు జాగ్రత్తగా వుండాలి. ఈ క్రమంలోనే ఏం  చేయాలో, ఏం చేయకూడదో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. మరీ ముఖ్యంగా కంపెనీలు అందజేసే ఉచిత సేవల ఆఫర్‌లను జాగ్రత్తగా విశ్లేషించాలి. కొన్ని ఎడ్ టెక్ కంపెనీలు ఉచిత సేవలను అందించడం, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (ఈఎఫ్‌టీ), సంతకం, ఆటో డెబిట్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం వంటి వాటి ముసుగులో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర పాఠశాల విద్య, అక్ష్యరాస్యత మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది.

ఈ క్రమంలో ఇలాంటి వాటి విషయంలో ఏం చేయాలో చేయకూడదో ఒకసారి చూస్తే:

ఇవి చేయొచ్చు: 

  • సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లింపు కోసం ఆటో డెబిట్ ఎంపికను వుపయోగించకండి. కొన్ని ఎడ్ టెక్ కంపెనీలు ఫ్రీ- ప్రీమియం బిజినెస్ మోడల్‌ను అందిస్తుంది. ఇక్కడ వారి సేవలు చాలా వరకు మొదట ఉచితం అనిపించవచ్చు. అయితే నిరంతరంగా క్లాస్‌లు కొనసాగడానికి విద్యార్ధులు సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి రావొచ్చు. ఆటో డెబిట్ యాక్టివేట్ చేయడం వల్ల పిల్లలు.. కంపెనీ అందించే ఉచిత సేవలను యాక్సెస్ చేయడం లేదని గ్రహించకుండానే, చెల్లింపు ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. 
  • మీరు ఉపయోగించే డివైస్‌ను మీ ఐపీ అడ్రస్‌గా లేదా వ్యక్తిగత డేటా ట్రాకింగ్ కోసం అంగీకరించే ముందు నిబంధనలను ఒకటికి రెండుసార్లు చదవండి.
  • కంటెంట్‌లు, యాప్ కొనుగోలు, పెన్‌డ్రైవ్ లెర్నింగ్‌ తదితరాల కోసం టాక్స్ ఇన్‌వాయిస్ స్టేట్‌మెంట్ అడగండి.
  • మీరు సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటున్న ఎడ్ టెక్ కంపెనీ నేపథ్యాన్ని తనిఖీ చేయండి.
  • ఎడ్ టెక్ కంపెనీలు అందించే కంటెంట్ నాణ్యతను ధ్రువీకరించి.. అది సిలబస్, మీ అధ్యయన పరిధికి అనుగుణంగానే వుందని , పిల్లలకు అర్థమయ్యేలా వుందని నిర్ధారించుకోండి.
  • ఏదైనా ఎడ్ టెక్ కంపెనీలో మీ పిల్లల క్లాస్ కోసం పెట్టుబడి పెట్టేముందు చెల్లింపు, కంటెంట్‌కు సంబంధించి మీ ప్రశ్నలను క్లారిఫై చేసుకోండి.
  • పిల్లలు దానిని ఉపయోగించడానికి ముందు యాప్, బ్రౌజర్‌లో తల్లిదండ్రుల నియంత్రణలు, సెక్యూరిటీ ఫీచర్స్‌ను యాక్టివేట్ చేయండి. తద్వారా నిర్ధిష్ట కంటెంట్ మాత్రమే పిల్లలు యాక్సెస్ చేసే పరిమితం చేయడంతో పాటు యాప్ కొనుగోళ్లపై ఖర్చును నియంత్రిస్తుంది. 
  • ఎడ్యుకేషన్ యాప్స్‌లో కొన్ని ఫీచర్‌లు ఎక్కువ ఖర్చు చేయడాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించబడుతున్నాయని అర్ధం చేసుకోవడంలో పిల్లలకు సహాయపడంది. అలాగే ఎడ్ టెక్ కంపెనీలు ఉపయోగించే మార్కెటింగ్ వ్యూహాలు, పరిణామాల గురించి వారితో మాట్లాడండి.
  • ఇప్పటికే సదరు యాప్‌పై ఏమైనా ఫిర్యాదులు వున్నాయా..? మార్కెటింగ్ జిమ్మిక్కుల కోసం ఎడ్ టెక్ కంపెనీ ఆన్‌లైన్‌లో విద్యార్ధి, తల్లిదండ్రుల సమీక్షలను పరిశీలించండి. 
  • ఫిర్యాదులను దాఖలు చేయడానికి అంగీకారం లేకుండా ఏదైనా ఎడ్యుకేషన్ ప్యాకేజ్‌ల కోసం బలవంతంగా సైన్ అప్ చేసిన ఆధారాలను రికార్డు చేయండి.
  • ఏదైనా ఎడ్ టెక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే ముందు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ‘‘PRAGYATA ’’ మార్గదర్శకాలలో పేర్కొన్న పిల్లల భద్రతా మార్గదర్శకాలను పరిశీలించండి.

ఇవి చేయకండి:

  • ఎడ్ టెక్ కంపెనీల ప్రకటనలను గుడ్డిగా నమ్మొద్దు
  • మీకు తెలియని రుణాల కోసం సైన్ అప్ చేయొద్దు
  • ప్రామాణికతను ధృవీకరించకుండా మొబైల్ ఎడ్ టెక్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయొద్దు
  • సభ్యత్వాల కోసం యాప్‌లలో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను నమోదు చేయొద్దు.
  • ఈమెయిల్, కాంటాక్ట్ నంబర్లు, కార్డు వివరాలు, చిరునామాలు మొదలైనవి ఆన్‌లైన్‌లో పెట్టొద్దు. ఎందుకంటే మీ డేటాను విక్రయించే అవకాశం వుంది.
  • ఎలాంటి వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు, షేర్ చేయవద్దు. వీడియో ఫీచర్‌ను ఆన్ చేయడం, ధ్రువీకరించని ఫ్లాట్ ఫామ్‌లలో వీడియో కాల్‌లను పొందకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • తప్పుడు హామీల కారణంగా ధ్రువీకరించని కోర్సులకు సభ్యత్వాన్ని పొందవద్దు.
  • సరైన తనిఖీ లేకుండా ఎడ్ టెక్ కంపెనీలు ప్రచారం చేసే కథనాలను నమ్మొద్దు. ఎందుకంటే అవి ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ట్రాప్ కావచ్చు.
  • తల్లిదండ్రుల అనుమతి లేకుండా కొనుగోళ్లను అనుమతించవద్దు. యాప్‌లో కొనుగోళ్లను నివారించడానికి ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం .. ఓటీపీ ఆధారిత చెల్లింపు పద్ధతులను అనుసరించవచ్చు.
  • మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్‌ను మార్కెటింగ్ సిబ్బందితో పంచుకోవద్దు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి
  • లింక్‌లపై క్లిక్ చేయవద్దు, అలాగే పాప్ అప్ స్క్రీన్‌ల విషయంలోనూ జాగ్రత్తగా వుండండి


ఇ-కామర్స్ నిబంధనలు & పరిష్కార వ్యవస్థ:

  • వినియోగదారుల రక్షణ (ఈ కామర్స్) నియమాలు, 2020ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం, ప్రజాపంపిణీ (వినియోగదారుల వ్యవహారాల శాఖ) జూలై 23, 2020 నాటి నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేసింది. 
  • ప్రస్తుతం ఎడ్ టెక్ కంపెనీలు వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్నాయి. తద్వారా వారి ఫ్లాట్‌ఫాంకు సబ్‌స్క్రైబ్ చేసే విద్యార్ధులు, ఉపాధ్యాయులు సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ఫ్లాట్‌ఫామ్‌లు అందించే సేవలకు సంబంధించి చేసిన క్లైయిమ్‌ల గురించి జాగ్రత్తగా వుండాలి.  ఎడ్ టెక్ కంపెనీలు చట్టానికి అనుగుణంగా తనిఖీ చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెబుతోంది.
  • ఈ కామర్స్ కంపెనీ తమను తాము సబ్‌స్క్రైబర్‌గా తప్పుగా సూచించకూడదు. అలాగే దాని ఉత్పత్తులకు సంబంధించిన సమీక్షలను పోస్ట్ చేయకూడదు. విద్యాపరమైన కంటెంట్, దాని అభ్యాస సాధనాల నాణ్యత, లక్షణాలను తప్పుగా సూచించకూడదు.
  • ప్రతి ఈ కామర్స్ కేంద్ర ప్రభుత్వ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ కన్వర్జెన్స్ ప్రాసెస్‌లో భాగస్వామి కావడానికి ఉత్తమ ప్రయత్న ప్రాతిపదికన ప్రయత్నిస్తోంది.
  • అన్ని ఎడ్ టెక్ కంపెనీలకు ఫిర్యాదు అధికారి, పేరు, కాంటాక్ట్ నెంబర్, ఫిర్యాదు అధికారి హోదా వుండాలి. అంతేకాదు వారు తప్పనిసరిగా నివసించాలి. ఫిర్యాదు అందిన నలభై ఎనిమిది గంటల లోపు పరిష్కరించాలి. 
  • ప్రతి ఈ కామర్స్ సంస్థ.. రిజర్వ్ బ్యాంక్ లేదా ఏదైనా చట్టం ప్రకారం అమల్లో వున్న చెల్లింపుల విధానాన్ని అమలు చేయాలి
  • సంస్థలు ప్రచురించే, లేదా ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనలు ఏదైనా అథారిటీ చేత గుర్తించబడాలి. 
  • ఒకవేళ సదరు వాణిజ్య ప్రకటన అథారిటీచే గుర్తించబడకపోయినా, ఆమోదించబడకపోయినా .. లేదా అనుబంధ సంస్థ చేత గుర్తించబడినా అప్పుడు దాని పేరు, చిరునామాను తప్పనిసరిగా తెలపాలి. టెలివిజన్, రేడియోలలో కూడా దాని పేరు తెలియజేయాలి.
  • ఉత్తీర్ణత సాధించిన బ్యాచ్, విద్యార్ధుల సగటు, విద్యార్ధుల నమోదు, ప్రఖ్యాత విద్యాసంస్థల్లో వారి అడ్మిషన్‌లు, ఉత్తీర్ణత సాధించిన వారి మార్క్‌లు, ర్యాంకులు, టాపర్ విద్యార్ధుల టెస్టిమోనియల్‌లు, సంస్థ దాని ర్యాంకింగ్, ఇన్‌స్టిట్యూట్‌లో మౌలిక సదుపాయలు మొదలైనవి సాక్ష్యాధారాలతో పక్కాగా వుండాలి. 

విద్యా మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ స్వతంత్ర సంస్థలు, అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు ఇచ్చిన ఉచిత ఈ లెర్నింగ్ కంటెంట్, పాఠ్యపుస్తకాలు, డిజిటల్ ల్యాబ్‌లు, ఆన్‌లైన్‌లో వుంచారు. వాటిని ఇక్కడ యాక్స్ చేసుకోచ్చు. 

https://diksha.gov.in/
http://www.olabs.edu.in/
https://swayam.gov.in/
https://www.nios.ac.in/

ఏదైనా అవాంఛనీయ సంఘటనపై ఫిర్యాదు చేయడానికి ఈ కింద సూచించిన వెబ్‌సైట్‌లను సంప్రదించండి.

https://ascionline.in/
https://consumerhelpline.gov.in/
https://pgportal.gov.in/
 

Follow Us:
Download App:
  • android
  • ios