విజయనగరం, నవంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వ ఐటి శాఖ సంస్థ APITA (ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ) ఆధ్వర్యం లో స్థానిక మహారాజా ఇంజనీరింగ్ కాలేజి లో ఇన్ఫోసిస్ కంపెనీ కి జరిగిన పూల్ క్యాంపస్ లో శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం కి చెందిన వివిధ ఇంజనీరింగ్ కాలేజిలకిి చెందిన సుమారు 1500 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

వీరికి  ఆన్‌లైన్ పరిక్ష మరియు మౌఖిక పరీక్షలు తర్వాత 226 విద్యార్థుల ఎంపిక అయ్యారు. APITA ఆధ్వర్యంలో  ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు  డిసంబర్ 21 వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని జిల్ల విద్యార్థులకు ఎంపిక చేయబడిన కాలేజీలలో జరుగుతాయి అని ఐటిఈ&సి  డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రెటరీ మరియు అపిత సీఈఓ వీ.అర్. నాయక్ తెలిపారు.