ఏపీలోని చిత్తూరు జిల్లా మహిళా అభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ ఉద్యోగాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతున్నది.

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అంగన్వాడీ వర్కర్ (టీచర్), అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

10వ తరగతి అర్హత ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివాహితులై ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 21 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

also read Navy Jobs:ఇండియన్ నేవీ 2020 నోటిఫికేషన్ విడుదల


అంగన్వాడీ ఉద్యోగాల మొత్తం ఖాళీల సంఖ్య: 489

పోస్టు ఖాళీలు
అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) 63
మినీ అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) 83
అంగన్వాడీ సహాయకులు (హెల్పర్) 343
మొత్తం ఖాళీలు 489

అర్హతలు .

పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అంగన్వాడీ ఉన్న గ్రామంలో వివాహితులైన స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

also read ఆసియా నెట్ న్యూస్ తెలుగులో ఖాళీలు: దరఖాస్తు చేసుకోండి

వయోపరిమితి: 01.07.2019 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 18 సంవత్సరాలు నిండినవారు కూడా అర్హులు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం.

దరఖాస్తు ఫీజు: రూ.30.


ముఖ్యమైన తేదీలు .

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.11.2019.

 దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 30.11.2019.