ఇండియన్ నేవీలో అక్టోబరు-2020 బ్యాచ్‌కు సంబంధించి 'సెయిలర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పోస్టులకు అనుగుణంగా 1 : 3 నిష్పత్తిలో ఫిజికల్, మెడికల్ పరీక్షలకు ఎంపికచేస్తారు.


పోస్టుల వివరాలు..

సెయిలర్(మెట్రిక్‌ రిక్రూట్)-అక్టోబ‌రు 2020 బ్యాచ్: 400 పోస్టులు

పోస్టులు: చెఫ్‌, స్టీవార్డ్‌, హైజినిస్ట్.

అర్హత: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: 01.10.2000 - 30.09.2003 మధ్య జన్మించి ఉండాలి.


ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.215. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ద్వారా.

శిక్షణ: రాతపరీక్ష, ఇతర పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు 2020 అక్టోబరులో శిక్షణ మొదలుకానుంది. వీరికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో 15 వారాలపాటు సాధారణ శిక్షణ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్‌తోపాటు ఇతర నావికాదళ శిక్షణ కూడా ఉంటుంది. సర్వీసు అవసరాల మేరకు బ్రాంచ్/ ట్రేడ్‌ను కేటాయిస్తారు.

పే, అలవెన్సులు: శిక్షణ కాలంలో నెలకు రూ.14,600 స్టైపెండ్‌గా ఇస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి లెవల్-3 డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ప్రకారం రూ.21,700-రూ.69,100 వరకు వేతనం ఉంటుంది. వీటితోపాటు MSP కింద నెలకు రూ.5200, డీఏ అదనపు భత్యాలుగా ఉంటాయి.

ప్రమోషన్: ప్రమోషన్ సమయంలో మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్-1, లెవల్-8 డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ప్రకారం నెలకు రూ.47,600-రూ.1.51,100 వేతనం ఇస్తారు. MSP, డీఏలు ఎలాగూ ఉంటాయి.

పరీక్ష విధానం..
మొత్తం 50 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.
 మల్టీపుల్ చాయిస్ (ఆబ్జెక్టివ్) విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
రాతపరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి. సైన్స్ & మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రెండు సెక్షన్లలోను కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
 పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి.
 పరీక్ష సమయం 30 నిమిషాలు
 పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు. ప్రతి నాలుగు తప్పుడు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు.

ఫిజకల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)
రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే తర్వాతి దశకు ఎంపికచేస్తారు.
ఫిజకల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ పరుగు ఉంటుంది. 20 స్క్వాట్స్, 10 ఫుషప్స్ తీయాల్సి ఉంటుంది.


శారీరక ప్రమాణాలు..
అధీకృత మిలిటరీ డాక్టర్లు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
 అభ్యర్థులు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. తగినంత బరువు, చెస్ట్ ఉండాలి. గాలిపీల్చినపుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచం ఉండాలి.
మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలి.
 ప్రాథమిక మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించినవారికే ఫైనల్ మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఐఎన్‌ఎస్ చిల్కాలో వీరికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
 ఫైనల్ ఎన్‌రోల్‌మెంట్ మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు.
 మెడికల్ పరీక్షలో అర్హత సాధించలేనివారు విశాఖపట్నంలోని INHS కల్యాణిలో 21 రోజుల్లోపు అప్పీలు చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 23.11.2019

 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 28.11.2019

హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 2020 ఫిబ్రవరిలో (పరీక్షకు 10 రోజుల ముందుగా).

 పరీక్ష నిర్వహణ: ప్రకటించాల్సి ఉంది.

 పరీక్ష ఫలితాలు: పరీక్ష పూర్తయిన నెలరోజుల్లో.