ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ స‌ర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 'ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ స‌ర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌' సంస్థ దేశ‌వ్యాప్తంగా ఉన్న కార్యాల‌యాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో సెక్యూరిటీ స్క్రినర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అనుభవం కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

also read CCRAS'లో క్లర్క్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల


వివ‌రాలు.

సెక్యూరిటీ స్క్రినర్ : 419 పోస్టులు

పోస్టుల కేటాయింపు.
పోస్టు ఖాళీలు
సూరత్ 16
భోపాల్ 16
అహ్మదాబాద్ 67
కోల్‌కతా 73
గోవా 50
శ్రీనగర్ 07
చెన్నై 114
కాలికట్ 30
జైపూర్ 25
లక్నో 21
మొత్తం ఖాళీలు 419

అర్హత‌: ఏదైనా డిగ్రీ. సంబంధిత టెక్నిక‌ల్‌ స‌ర్టిఫికెట్లు కలిగి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాష‌ తెలిసి ఉండాలి. తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 15.11.2019 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ' 'AAI Cargo Logistics & Allied Services Company Ltd.” పేరిట న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా డిడి తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. డిడిపై అభ్యర్థి పూర్తి పేరు, ఫోన్ నెంబర్, పుట్టినతేది వివరాలను రాయాలి.

also read Anganwadi Jobs: అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


జీతం: నెలకు రూ.25,000- రూ.30,000. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

దరఖాస్తుల సమర్పణకు చివ‌రితేది: 09.12.2019.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Joint General Manager (HR),

AAI Cargo Logistics & Allied Services Company Limited,

AAICLAS Complex, Delhi Flying Club Road,

Safdarjung Airport,

New Delhi-110 003.