రష్యా ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా దాదాపు 400 కమికేజ్ డ్రోన్‌లను ఉపయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ యుద్దంలో ఇజ్రాయెల్ సహయంతో ముందుకు సాగాలని చూస్తున్నామని జెలెన్స్కీ అన్నారు. అలాగే ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలిపారు.

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా నిరంతరం దాడి చేస్తోంది. ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఎంత చెప్పిన రష్యా తన పట్టు వీడటం లేదు. ఇప్పటికే అమెరికా సహా ఇతర దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు కూడా పుతిన్‌ను ఆపలేకపోయాయి. ఈ యుద్దాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. అదే సమయంలో..మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం రష్యాపై విమర్శలు గుప్పించారు. యుద్ధంలో ఉక్రెయిన్‌పై దాడులు చేసేందుకు రష్యా ఇప్పటివరకు దాదాపు 400 కమికేజ్ డ్రోన్‌లను ఉపయోగించిందని ఆయన చెప్పారు.

Scroll to load tweet…

ఇజ్రాయెల్ సహాయంపై జెలెన్స్కీ విశ్వాసం 

తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కైవ్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఉక్రెయిన్ ,ఇజ్రాయెల్ మధ్య సంబంధాల గురించి మాట్లాడారు. చాలా కాలం తర్వాత.. ఇజ్రాయెల్‌తో ముందుకు సాగడం చూస్తున్నామని, ఉక్రెయిన్‌కు ఇజ్రాయెల్ సహాయపడుతుందని అన్నారు. ఇజ్రాయెల్ నుండి ఇది సానుకూల అడుగు అని ఆయన అన్నారు. సహాయం కోసం ఇజ్రాయెల్‌పై విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఆ దేశానికి జెలెన్స్కీ ధన్యావాదాలు చెప్పారు. యుద్ధం గురించి ఇజ్రాయెల్‌కు తెలుసునని, ఇజ్రాయెల్ మరింత మద్దతు ఇవ్వాలని ఆయన వివరించారు. ఫిబ్రవరి 24 నుంచి ఇజ్రాయెల్ సహయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రజలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నారని, కాని తమకు ఇజ్రాయెల్ రాజకీయ నాయకత్వం అవసరమని తెలిపారు.

యుద్దంలో డ్రోన్ల వినియోగం

ఉక్రెయిన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి రష్యా ఇరాన్ నిర్మితమైన కమికేజ్ డ్రోన్‌లను విస్తృతంగా ఉపయోగిస్తోంది, అయితే రష్యా మిలిటరీ వాటిని ఎవరూ గుర్తించకుండా వేరే పేరుతో ఉపయోగిస్తుందని ఆరోపించారు. అయితే, డ్రోన్‌ల గురించి ఇరాన్‌ను ప్రశ్నించగా, టెహ్రాన్ రష్యాకు డ్రోన్‌లను ఇవ్వలేదని తెలిపింది. అదే సమయంలో ఇరాన్ తప్పుడు ప్రకటన చేసిందని వైట్ హౌస్ పేర్కొంది.

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తన వాషింగ్టన్ పర్యటనలో ఉక్రెయిన్‌లో ఇరాన్ తయారు చేసిన కమికేజ్ డ్రోన్‌లను రష్యా మోహరించినట్లు ఇంటెలిజెన్స్ గురించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు వివరించనున్నారు.