ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత...!
ఆండ్రీ 1904వ సంవత్సరంలో ఫ్రెంచ్ లోని అలెస్ నగరంలో జన్మించారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఆమె జన్మించినట్లు భావిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ నన్ సిస్టర్ లూసిల్ రాండన్ అలియాస్ ఆండ్రీ కన్నుమూశారు. చనిపోయే సమయానికి ఆమె వయసు 118ఏళ్లు కావడం గమనార్హం. ఫ్రాన్స్ లోని టౌలానన్ నగరంలో ఆమె మరణించారు. ఆమె మరణ వార్తను టౌలాన్ నగర మేయర్ హుబెర్ట్ ఫాల్కో ట్వీట్ చేశారు.
వయసురిత్యా వచ్చిన సమస్యల కారణంగా ఆమె కన్నుమూశారు. కాగా... ఆమె మరణ వార్త తనను ఎంతో బాధించిందని మేయర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఆండ్రీ 1904వ సంవత్సరంలో ఫ్రెంచ్ లోని అలెస్ నగరంలో జన్మించారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఆమె జన్మించినట్లు భావిస్తున్నారు. 19ఏళ్ల వయసులో ఆండ్రీ కాథలిన్ గా మారి... ఆ తర్వాత... నన్ గా మారారు. కాగా... 2021 లో ఆమె కు కరోనా సోకగా.... దాని నుంచి కూడా క్షేమగా బయటపడ్డారు. తాజాగా... అనారోగ్యంతో మృతి చెందారు.