దేవుడా... ఇక నుంచి తలలు కూడా మార్చేస్తారా..? షాకింగ్ వీడియో

ఆ  వీడియోలో.. రెండు రోబోలు మానవ తలను ఒక రోబోటిక్ శరీరం నుండి మరొకదానికి సజావుగా బదిలీ చేశాయి. ఆ సీన్ చూస్తే.. ఏదో సినిమా చూసిన అనుభూతి కలుగుతోంది. 
 

World  first head transplant system: US-based startup's spine-chilling, graphic video shocks Internet ram

ఇప్పటి వరకు మనం ఎన్నో ట్రాన్స్ ప్లాంట్స్  చూశాం. హార్ట్ , కిడ్నీ ఇలాంటివి ఇప్పటి వరకు చాలానే చేశారు.  అయితే... భవిష్యత్తులో తలల మార్పిడి కూడా జరగనుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. అమెరికాలో  ఇలాంటి ఆవిష్కరణకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి.

యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న ఒక మార్గదర్శక న్యూరోసైన్స్ , బయోమెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్  బ్రెయిన్‌బ్రిడ్జ్, ప్రపంచంలోనే మొట్టమొదటి తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తన సాహసోపేతమైన మిషన్‌ను ఆవిష్కరించింది. ఆవిష్కరించడమే కాదు..ఆ మెషిన్ ఎలా పని చేస్తుంది అనేది తెలిపేలా ఓ వీడియోని కూడా విడుదల చేశారు. ఆ  వీడియోలో.. రెండు రోబోలు మానవ తలను ఒక రోబోటిక్ శరీరం నుండి మరొకదానికి సజావుగా బదిలీ చేశాయి. ఆ సీన్ చూస్తే.. ఏదో సినిమా చూసిన అనుభూతి కలుగుతోంది. 

ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లోని సన్నివేశాలను గుర్తుకు తెస్తూ, ఈ రకం ప్రయోగాలను తాము సైంటిఫిక్ గా నిరూపించాలని అనుకుంటన్నామని బ్రెయిన్ బ్రిడ్జ్ తెలియజేసింది.  స్టేజ్-4 క్యాన్సర్, పక్షవాతం , బలహీనపరిచే న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల వంటి అకారణంగా అధిగమించలేని పరిస్థితులతో బాధపడుతున్న రోగులకు  ఈ  హెడ్ ట్రాన్స్ ప్లాంట్ ఆశాజనకంగా ఉంటుందని వారు చెప్పడం గమనార్హం.. అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి రోగులకు కూడా ఇది ఉపయోగపడుతుందని వారు చెప్పడం గమనార్హం. 

ఏవరైనా వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటే... వారి తలను... ఇతర ఏ సమస్యలు లేకుండా కేవలం బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన వారి బాడీకి ఎటాచ్ చేస్తారట. ఈ శస్త్ర చికిత్స చేసే రోబోలు.. రెండు బాడీలకు  ఒకేసారి శస్త్ర చికిత్స చేయగలవట.  హెడ్ మార్పిడి తర్వాత కూడా.. వారికి సంబంధించిన అన్ని విషయాలు గుర్తుంచేలా జాగ్రత్తలు తీసుకుంటారట. 

అయితే... తమ ఆలోచనను తెలియజేస్తూ..  బ్రెయిన్ బ్రిడ్జ్ విడుదల చేసిన ఈ వీడియోకి ఎక్కువ మంది నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ  టెక్నాలజీని ఎక్కువ మంది దుష్ప్రయోజనాలకు ఉపయోగించే అవకాశం ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. కొందరేమో.. దేవుడు సృష్టించినదానికి  భిన్నంగా ఎవరూ ఏదీ చేయకూడదని కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో.. ఇలాంటి సదుపాయం కేవలం డబ్బు ఉన్నవారికి మాత్రమే అందుతాయని.. సామాన్యలకు చేరదు అని  భావిస్తున్నారు.

 

ప్రస్తుతం ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో ఫుల్ చర్చలు జరుగుతున్నాయి.  బ్రెయిన్ బ్రిడ్జ్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. బ్రెయిన్‌బ్రిడ్జ్‌లో ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ నేతృత్వంలో, కంపెనీ తన ప్రతిష్టాత్మక దృష్టి సాకారం కోసం ఒక క్లిష్టమైన రోడ్‌మ్యాప్‌ను వివరిస్తుంది. హై-స్పీడ్ రోబోటిక్ సిస్టమ్‌లు మెదడు కణాల క్షీణతను తగ్గించడానికి , మార్పిడి చేయబడిన తల , దాత శరీరం మధ్య అతుకులు లేని విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  వెన్నుపాము, నరాలు , రక్తనాళాల  సున్నితమైన పునఃసంధానంలో శస్త్రచికిత్స రోబోట్‌లకు మార్గనిర్దేశం చేసేందుకు అధునాతన AI అల్గారిథమ్‌లు ఏర్పాటు చేశారు. తల ట్రాన్స్ ప్లాంట్ తర్వాత.. న్యూరాలను తిరిగి కనెక్ట్ చేయడానికి పాలిథిలిన్ గ్లైకాల్ రూపొందిస్తున్నారు. 

తమ పూర్తి అధ్యయనాల ఫలితాలు సానుకూలంగా ఉంటే... ఇలాంటి మొదటి శస్త్ర చికిత్స రాబోయే ఎనిమిది సంవత్సరాల్లో కచ్చితంగా జరుగుతుందని ప్రాజెక్ట్ లీడ్ హమేమ్ అల్-ఘైలీ చెబుతున్నారు. మరి.. ఇలాంటి ట్రాన్స్ ప్లాంట్ లను జనాలు ఎలా స్వీకరిస్తారో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios