Asianet News TeluguAsianet News Telugu

మా భూభాగాన్ని అమెరికాకు ఇవ్వం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఆఫ్ఘానిస్తాన్‌పై అమెరికా చర్యలు చేపట్టేందుకు తమ సైనిక స్థావరాలు, భూభాగాన్ని వినియోగించుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్.

wont allow us to use pak military bases says imran khan ksp
Author
Islamabad, First Published Jun 20, 2021, 2:56 PM IST

ఆఫ్ఘానిస్తాన్‌పై అమెరికా చర్యలు చేపట్టేందుకు తమ సైనిక స్థావరాలు, భూభాగాన్ని వినియోగించుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. అల్‌ఖైదా, ఐసిస్, తాలిబన్‌పై ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకునేందుకు పాక్ భూభాగాన్ని ఇస్తారా అన్న ప్రశ్నకు ఇమ్రాన్ పై విధంగా సమాధానమిచ్చారు. 

పాకిస్తాన్ సైనిక స్థావరాల వినియోగానికి సంబంధించిన చర్చల్లో ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొందని అమెరికా అధికారులు చెప్పినట్లుగా ఇటీవల ఓ అంతర్జాతీయ కథనం ప్రచురితమైంది. మరోవైపు దీనిపై పాకిస్తాన్- అమెరికా మధ్య త్వరలోనే ఓ ఒప్పందం కుదిరే అవకాశం వుందని మరికొందరు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios