ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ తన భర్తకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చేసిన పని ఆమె కొంప ముంచింది. ఈ ఘటన అస్ట్రేలియాలో చోటు చేసుకొంది.

పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ భర్తతో కలిసి  అస్ట్రేలియాలో నివాసం ఉంటోంది. భర్తకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఆమె భావించింది. భర్త ఆఫీసు నుండి  వచ్చే సమయానికి  స్నేక్ ప్రింటెండ్ లెగ్గింగ్స్ వేసుకొంది. 

ఆ లెగ్గింగ్స్ వేసుకొని బెడ్‌పై హాయిగా నిద్రపోయింది. అంతేకాదు ఆమె తన రెండు కాళ్లను  దుప్పటి బయట పెట్టింది. అయితే స్నేక్ ప్రింటెండ్ లెగ్గింగ్స్ కావడంతో అవి రెండు పాముల వలే కన్పిస్తున్నాయి.

ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన  భర్త షాక్‌కు గురయ్యారు. తన భార్య నిద్రిస్తున్న బెడ్‌పై రెండు పాములు ఉన్నాయని భావించాడు. చప్పుడు కాకుండా బయటకు వెళ్లి బేస్‌బాల్ బ్యాట్ తీసుకొని భార్య కాలుపై( పాము తలగా భావించి)  కొట్టాడు. దీంతో భార్య బాధతో అరిచింది. అయితే పామును చూసి భార్య అరుస్తోందేమోననే మరింత గట్టిగా కొట్టాడు.

అయితే పాము కాదని తాను లెగ్గింగ్స్ ధరించినట్టుగా  భార్య అరవడంతో  భర్త తేరుకొన్నాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.