లాస్ ఎంజిలెస్ కు చెందిన 24 యేళ్ల సమ్మర్ డియాజ్ కొన్ని నెలల కిందట కారు ప్రమాదానికి గురైంది. తను రోడ్డు దాటుతుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డియాజ్ తీవ్రంగా గాయపడింది. మెదడుకూ దెబ్బ తగలడంతో Comaలోకి వెళ్లింది. 

ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన వ్యక్తులు కోలుకోవడానికి ఎంతకాలమైనా పట్టొచ్చు. ఒకవేళ కోమా నుంచి బయటకు వచ్చినా కొందరు గతం మర్చిపోవడం లేదా వింతగా ప్రవర్తిస్తుండడం చూస్తుంటాం. కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ కోమా నుంచి బయటకొచ్చి.. అసలు తనకు ఏ మాత్రం తెలియని కివీ భాష యాసలో అనర్గళంగా మాట్లాడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

లాస్ ఎంజిలెస్ కు చెందిన 24 యేళ్ల సమ్మర్ డియాజ్ కొన్ని నెలల కిందట కారు ప్రమాదానికి గురైంది. తను రోడ్డు దాటుతుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డియాజ్ తీవ్రంగా గాయపడింది. మెదడుకూ దెబ్బ తగలడంతో Comaలోకి వెళ్లింది. 

రెండు వారాల తరువాత కోలుకున్నా.. మాట్లాడలేని పరిస్థితి తలెత్తింది. తను యూనవర్సిటీలో నేర్చుకున్న Sign languageతోనే మాట్లాడుతూ రోజులు వెళ్లదీసింది. కొంతకాలానికి ఆమెకి తిరిగి మాటలొచ్చినా వింతగా న్యూజిలాండ్ Kiwi language (ఇంగ్లీష్ భాషే కానీ.. యాసలో చాలా తేడా ఉంటుంది)లో మాట్లాడటం ప్రారంభించింది. 

గతంలో ఒక్కసారి కూడా డియాజ్ న్యూజిలాండ్ కు వెళ్లలేదు. అక్కడి యాస గురించి తెలియదు. అయినా తను కివీ యాసలో మాట్లాడటం విడ్డూరం. అయితే, డియాజ్ ను పరీక్షించిన వైద్యులు ఆమెకు Foreign Accent Syndrome ఉన్నట్లు స్పష్టం చేశారు. మాట్లాడే భాషలో అకస్మాత్తుగా మార్పులు వస్తుంటాయని వైద్యులు తెలిపారు. 

Afghanistan: తొమ్మిదేళ్ల కూతురిని అమ్మేసిన తండ్రి.. ‘బతకాలంటే తప్పట్లేదు’

కత్తితో బెదిరించి.. ట్రైన్ కి నిప్పు...
ఆదివారం, అక్టోబర్ 31న జపాన్‌లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో ప్రయాణికులను బెదిరిస్తూ ఓ ట్రైన్‌లోకి ఎక్కాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న ఓ లిక్విడ్‌ను బోగీలో పిచికారీ చేశాడు. అనంతరం నిప్పు అంటించాడు. దీంతో హడలిపోయిన ప్రయాణికులు పరుగులు పెట్టారు. 

ట్రైన్ నుంచి బయటపడటానికి విశ్వప్రయత్నాలు చేశారు. కిటికీల గుండా బయటకు రావడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డట్టు తెలిసింది. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

Fire నుంచి తప్పించుకోవడానికి ట్రైన్ కిటికీల్లో నుంచి బయటకు రావడానికి ప్రయాణికులు ప్రయత్నించారు. బయట ఉన్నవారు వారిని పదిలంగా పట్టుకుని సులువుగా బయటపడానికి సహకరించారు. 

స్టేషన్ మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఘటనకు సంబంధించిన ఓ వీడియోలో అరుపులు, పరుగులు కనిపించాయి. Emergency సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ట్రైన్ వైపు వేగంగా కదిలి వెళ్తున్న ఎమర్జెన్సీ సిబ్బంది ఓ వీడియో కనిపించారు. 

Japanలో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కెయియో రైల్వే లైన్‌పై కొకుర్యో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. కత్తితో బెదిరింపులకు పాల్పడుతూ నిప్పు పెట్టిన దుండగుడి వయసు 20ఏళ్లు ఉంటాయని అంచనా వేశారు.

పోలీసులు సమాచారం అందుకుని వెంటనే స్పాట్‌కు తరలివచ్చారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసినట్టు మరో రిపోర్టు తెలిపింది. ట్రైన్ మొత్తంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను పంప్ చేసినట్టుగా కొందరు చెప్పారు. ఈ విషయంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జపాన్‌లో నూతన ప్రధానమంత్రి కోసం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇవి ఆదివారమే ముగిశాయి. అటు ఎన్నికలు ముగియగానే, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.