Asianet News TeluguAsianet News Telugu

న్యూయార్ మహిళకు బంపర్ ఆఫర్.. ఆర్డర్ చేయకుండానే.. అమెజాన్ ప్యాకేజీల వరద.. !!

న్యూయార్క్ లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఒక మహిళకు ఆర్డర్ ఇవ్వకుండానే వందల సంఖ్యలో అమెజాన్ ప్యాకేజీలు రావడం మొదలయ్యింది. రోజుకు పదుల సంఖ్యలో ఆర్డర్లు అందుకుంటుంది. వాటితో ఆమె ఇంటిగుమ్మంకూడా కనిపించకుండా ముసుకుపోయింది. 

Woman Receives Hundreds Of Amazon Packages By Mistake - bsb
Author
Hyderabad, First Published Jun 24, 2021, 10:18 AM IST

న్యూయార్క్ లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఒక మహిళకు ఆర్డర్ ఇవ్వకుండానే వందల సంఖ్యలో అమెజాన్ ప్యాకేజీలు రావడం మొదలయ్యింది. రోజుకు పదుల సంఖ్యలో ఆర్డర్లు అందుకుంటుంది. వాటితో ఆమె ఇంటిగుమ్మంకూడా కనిపించకుండా ముసుకుపోయింది. 

ఇది జూన్ 5 న మొదలయ్యింది. ఆ రోజు ఆమె చిరునామాకు డెలివరీ ట్రక్కుల్లో బాక్సులు రావడం ప్రారంభమయ్యాయని జిలియన్ కానన్ చెప్పారు. అయితే మొదట్లో ఈ ప్యాకేజులు తన బిజినెస్ పార్టనర్ పంపించారనుకుంది. అయితే ఆ వస్తువులు చూసిన తరువాత.. అవి తానుకానీ, తన బిజినెస్ పార్ట్నర్ కానీ ఆర్డర్ చేసినవి కావని తేలడంతో.. ఇదేమైనా స్కామా? లేక ఎవరైనా తమ వేర్ హౌస్ క్లియర్ చేస్తూ.. తనదగ్గర డంప్ చేశారా అని అనుమానించింది. 

ఆమె ముందు ఇలా బాక్సులు రావడం ప్రారంభం కాగానే.. పొరపాటు జరిగిందేమో అని అమెజాన్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి చెప్పింది. అంతేకాదు దీనిగురించి ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసింది. అయితే అమెజాన్ ఎగ్జిక్యూటివ్స్ మాత్రం ఇవి అధికారికంగానే ఆమె చిరునామాకు పోస్ట్ అయ్యాయని, ఇందులో ఎలాంటి పొరపాటు లేదని స్పష్టం చేశారు. 

ఆమెకు వచ్చిన బాక్సుల్లో కొన్నింటిలో పెద్దలు, పిల్లల ఫేస్ మాస్క్‌ల లోపల ఉపయోగించే వేలాది సిలికాన్ సపోర్ట్ ఫ్రేమ్‌లు ఉన్నాయని ఎన్బిసి న్యూస్ చెబుతోంది. ఈలోగా, ప్యాకేజ్ లు ఆమెకు రావడం మొదలయ్యింది. ప్రతీ ప్యాకేజ్ లో ఆమె అడ్రస్ ఉంది. కానీ రిటర్న్ అడ్రస్ లేదు. 

దీంతో ఆమె ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ట్రాకింగ్ నంబర్లను సెర్చ్ చేయడం, బార్‌కోడ్‌లను స్కాన్ చేయడం ప్రారంభించింది. " మొదట ఇది ఒక స్కామ్ అని నమ్మాను. లేదా ఎవరైనా వారి గిడ్డంగిని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని"అనుకున్నానని కానన్ అన్నారు. "కానీ అన్ని వస్తువులు ఒకే విధంగా ఉన్నందున, ఇక్కడ అదే జరిగిందని నేను అనుకోను . "

ఆమె మళ్ళీ అమెజాన్‌కు కాల్ చేసింది. వారు వచ్చి పరిశీలించారు. కానీ సమస్య ఎక్కడ మొదలయ్యిందో.. ఈ ఆర్డర్‌ల దాడిని మొదలుపెట్టిందెవరో గుర్తించలేకపోయారు. కానన్, ఆమె భర్త కూడా వీటిని అదృష్టంగా భావించలేదని, వాటిని వెనక్కి పంపడానికే ప్రయత్నించారని తెలిపారు. 

అయితే అది అంతటితో ఆగలేదు.. ప్యాకేజ్ లు ట్రక్కుల్లో రావడం మొదలయ్యింది. చివరికి అమెజాన్ అసలు ఓనర్ ను కనిపెట్టింది. కాకపోతే ఇప్పటివరకు కానన్ కు వచ్చిన ప్యాకేజీలను తన దగ్గరే ఉంచాల్సిందిగా కోసింది. దీంతో ఈ కుప్పను ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. వేలాదిగా వచ్చిపడిన మాస్క్ బ్రాకెట్స్ ను స్థానిక పిల్లల ఆసుపత్రిలో రోగులకు DIY మాస్క్ కిట్లను రూపొందించడానికి ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios