Asianet News TeluguAsianet News Telugu

బాయ్ ఫ్రెండ్ ని వెతికిపెట్టమని పోలీసులకు యువతి ఫిర్యాదు..!

కొందరు బాంబు బెదిరింపు ఫోన్స్ చేయడం, పిల్లి తప్పింపోయింది, కుక్క కనిపించడం లేదు అంటూ కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. 

woman police complaint against Boy friend in china
Author
First Published Feb 6, 2023, 11:44 AM IST

పోలీసులకు ఎప్పుడూ నేరాలకు సంబంధించిన కేసులే కాదు.. చిత్ర విచిత్ర కేసులు కూడా ఎదురౌతూ ఉంటాయి. కొందరు బాంబు బెదిరింపు ఫోన్స్ చేయడం, పిల్లి తప్పింపోయింది, కుక్క కనిపించడం లేదు అంటూ కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. తాజాగా... ఓ యువతి... తన బాయ్ ఫ్రెండ్ ని వెతికి పెట్టాలి అంటూ... పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత సంఘటన చైనాలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


చైనాకి చెందిన ఓ యువతి... ఓ యువకుడిని దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించింది. అయితే.. ఆ యువకుడు ఆమెను ఇటీవల వదిలేసి వెళ్లిపోయాడు. ఎందుకు వెళ్లాడో తెలీదు కానీ... ఆమెను వదిలేశాడు. దీంతో.. ఆమె అతనిని మర్చిపోలేకపోయింది. అతని కోసం వెతికింది కానీ.... దొరకలేదు. దీంతో... చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నా.. వెతికి పెట్టమని పోలీసులకు చెప్పింది. అయితే.... అతను తప్పిపోలేదని... ఆమెను కావాలని వదిలేసి వెళ్లాడని..... అలాంటి వ్యక్తికి దూరంగా ఉండటమే మంచిదని పోలీసులు ఆమెను నచ్చ చెప్పారు. మనల్ని కోరుకోని వ్యక్తి ని మనం కోరుకోవాలి అనుకోవడం లో అర్థం లేదని.. ఆమెకు హితోపదేశం చేశారు. దీంతో... ఆమె అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios