రోజు రోజుకీ మానవ సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. ఎవరు ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నారు..? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో కూడా తెలీకుండా తయారౌతోంది. కొందరైతే కనీసం వావి వరసలు కూడా పాటించడం లేదు.. పెళ్లి బంధానికి కనీస విలువ కూడా ఇవ్వకుండా.. చాలా సులభంగా విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ కట్టుకున్న భర్తను వదిలేసి.. అతని తండ్రిని పెళ్లాడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కెంటుకీలోని హారోడ్సర్గ్ ప్రాంతానికి చెందిన ఎరికా క్విగ్లే(31)కు 16ఏళ్ల వయసులో జస్టిన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎరికా, జస్టిన్‌లకు ఓ బిడ్డ పుట్టాడు. కొన్నాళ్లు పాటు సాఫీగా సాగిన వారి సంసారంలో కలతలు వచ్చాయి. దాంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎరికా జస్టిన్‌ సవతి తండ్రి జెఫ్‌(60)తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని జెఫ్‌కు చెప్పంది. అతడు కూడా ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దాంతో ఎరికా తన కంటే 29 ఏళ్ల పెద్దవాడు.. ఒకప్పుడు తనకు మామ అయిన జెఫ్‌ను పెళ్లాడింది.

అయితే తొలుత జస్టిన్‌ వారి పెళ్లిని అంగీకరించలేదట. తర్వాత తానే పరిస్థితి అర్థం చేసుకొని.. వారి పెళ్లికి అంగీకారం తెలిపాడు. ఈ సందర్భంగా  జస్టిన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా మధ్య అంతా బాగానే ఉంది. ఎరికా మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఆమె తన మనసుకు నచ్చిన పని చేసింది. తన ఫీలింగ్స్‌ని నేను అర్థం చేసుకున్నాను. ఇక బిడ్డ బాధ్యతను నాకే అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు. ఇక జెఫ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను, ఎరికా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిక్షణం ఆనందంగా గడుపుతున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడాని మేం పట్టించుకోవడం లేదు. ప్రేమలో పడ్డాం.. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాం’’ అని తెలిపాడు.