Asianet News TeluguAsianet News Telugu

విమానంలో మహిళ రీల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..!

కొందరు రోజుకో రీల్ చేసి షేర్ చేయనిది నిద్రపట్టదు. రీల్స్ చేసి వాటిని షేర్ చేసి అందరిలాగా గుర్తుంపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. 

Woman Makes Instagram Reel Inside Plane, Internet Angry ram
Author
First Published May 11, 2023, 2:58 PM IST

ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండటం, ఇంటర్నెట్ వినియోగం కూడా పెరగడంతో సోషల్ మీడియాకి ప్రజలు బానిసలుగా మారిపోతున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు. కొందరు రోజుకో రీల్ చేసి షేర్ చేయనిది నిద్రపట్టదు. రీల్స్ చేసి వాటిని షేర్ చేసి అందరిలాగా గుర్తుంపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. 

 రీల్స్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు కానీ, మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు కొందరు. ఓ మహిళ విమానంలో రీల్ చేసింది. తోటి ప్రయాణికులు ఇబ్బంది కలుగుతందనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆమె అలా రీల్ చేయడంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shiba khan (@shibakhan412)

కంటెంట్ సృష్టికర్త, షిబా ఖాన్, ఆమె విమానంలో డ్యాన్స్ చేస్తున్న వీడియోను రికార్డ్ చేసి, ఫిబ్రవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోని చూసి నెటిజన్లు ఆమెను విమర్శించడం గమనార్హం. ఆమె తన రీల్ పూర్తి చేసుకునే వరకు వెనక చాలా మంది ప్రయాణికులు ఎదురుచూస్తూ నిలపడటం గమనార్హం. ఆమె రికార్డు చేస్తూ ఉండటం వల్ల వారు సీట్లో కూర్చోవడానికి చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది.

నీ రీల్ కోసం ఇతరులను ఎలా ఇబ్బంది పెడతావు అంటూ ఆమెను నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆమె వీడియోకి దాదాపు 15మిలియన్ల వ్యూస్ రాగా, ప్రతి ఒక్కరూ ఆమె చేసిన పనిని తప్పు పట్టడం గమనార్హం. రీల్ చేయడం తప్ప కాదని, కానీ ఇతరులను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని ఆమెకు హితవు పలికారు. ఇంకొందరేమో పాపం విమానం ఎక్కడం మొదటిసారేమో, అందుకే ఇలా గంతులు వేస్తోంది అంటూ కౌంటర్ వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios