Asianet News TeluguAsianet News Telugu

తన కూతురిని పొడిచిందని.. కోడిపుంజుపై పగ తీర్చుకొని..!

ఇటీవల ఆ కోడి పుంజు ఆమె కుమార్తె బుగ్గ పై పొడిచిందట. అంతే...ఆమెకు విపరీతంగా కోపం వచ్చేసింది. కోడిపై కోపంతో ఊగిపోయిన ఆమె చివరకు దానిపై ప్రతీకారం తీర్చుకుంది.

woman kills her hen for hitting her baby
Author
First Published Jan 23, 2023, 10:08 AM IST

మనలో చాలా మంది పెంపుడు జంతువులను చాలా ప్రేమగా పెంచుకుంటారు. ఓ మహిళ కూడా ఓ కోడిపుంజును అంతే ప్రేమగా పెంచుకుంది. అయితే... అంత ప్రేమగా పెంచుకున్న కోడిపుంజు తన కన్న కూతురి బుగ్గపై పొడిచిందట. అంతే కోపంతో ఊగిపోయింది. ప్రేమగా పెంచుకుంటే.. ఇలా చేస్తావా అని కోపంతో దాని మీద పగ తీర్చుకుంది. దానిని చంపి.... వండుకొని తినేసింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రానికి చెందిన మేగన్ షిడ్మ్ అనే మహిళకు ఓ కూతురు ఉంది. కాగా... ఎప్పటి నుంచో ఆమె ఓ కోడి పుంజును పెంచుకుంటోంది. దాని పేరు హెయి హెయి. ఆ కోడి పుంజును ఆమె చాలా ప్రేమగా పెంచుకునేది. అయితే... ఇటీవల ఆ కోడి పుంజు ఆమె కుమార్తె బుగ్గ పై పొడిచిందట. అంతే...ఆమెకు విపరీతంగా కోపం వచ్చేసింది. కోడిపై కోపంతో ఊగిపోయిన ఆమె చివరకు దానిపై ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల ఓ రోజు దాన్ని చంపేసి చికెన్ నగ్గేట్స్ చేసేసింది. అక్కడితో ఆగక.. వాటి ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి జరిగిన ఘటన గురించి నెటిజన్లతో పంచుకుంది.

దీంతో... ఆమె చేసిన పని పట్ల కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరి కొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ తల్లిగా నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోగా పెంపుడు కోడిని చంపావు అంటూ కొందరు ఆమెను విమర్శించారు. కన్నబిడ్డ విషయంలో ఏ తల్లీ అయినా ఇలాగే చేస్తుందంటూ మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios