గురక.. ఇది  చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. గురక పెట్టేవారి కంటే.. పక్కన ఉన్నవారికే నరకం ఎక్కువ. వారు పెట్టే గురకతో కనీసం నిద్రకూడా పట్టదు. ఇలాంటి అనుభవమే ఓ యువకుడికి ఎదురైంది. ప్రేయసి రోజు గురక పెడుతూ అతనిని ఇబ్బంది పెడుతోంది. దీంతో.. విచిత్రమైన పరిష్కారం కనుగొన్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... జాన్ అబ్రహం అనే 22ఏళ్ల యువకుడు షార్ని బ్రైట్ అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. కాగా.. ఆమెకు నిద్రలో గురక పెట్టే సమస్య ఉంది. దీంతో.. జాన్ కి కనీసం నిద్ర కూడా పట్టడం లేదట. చాలా రోజులు నిద్రలేక ఇబ్బందిపడ్డాడట. దీంతో.. దీనికి పరిష్కారం కోసం చాలా రోజులు ఆలోచించాడు. చివరకు అతనికి ఓ ఉపాయం తట్టింది.

అదేంటంటే.. ప్రియురాలు గురక పెట్టే సమయంలో జాసన్‌ ఆమె ముఖాన్ని నాకేవాడు. దీంతో ఆమె గురకపెట్టడం ఆపేది.వారం రోజులపాటు ఇదే పద్ధతిని కొనసాగించాడు. దీంతో క్రమంగా ఆమె గురక తగ్గిపోవడంతో ఈ ప్రేమజంట ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తర్వాత ఒక సందర్భంలో తన ప్రియురాలికి తను పడుతున్న కష్టాల్ని తెలియజేయగా.. షార్ని బ్రైట్‌ షాకైంది. అయితే వెంటనే షార్ని బ్రైట్‌ తన ప్రియుడ్ని ఈ ప్రయోగం మళ్లీ చేస్తావా అని అంటే జాసన్‌ నో కామెంట్‌ అంటూ సమాధానమిస్తున్నాడు.