వీలైచైర్ లో ఉన్న ఓ మహిళ మీద మూడు కుక్కలు దాడి చేశాయి. ఆమెను వీల్ చైర్ నుంచి లాగి, చెవి మొత్తం కొరికి పడేశాయి. తల, చేతులకు కూడా తీవ్రగాయాలయ్యాయి.
ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వీల్ చైర్ కు పరిమితమైన దివ్యాంగురాలైన ఒక మహిళ మీద కుక్కలు దారుణంగా దాడి చేశాయి. వీల్‌చైర్ నుండి ఆమెను కిందికి గుంజేసి మరీ ఆమె మీద దాడి చేశాయి. ఆమె చెవిని చీల్చేశాయి. తీవ్రగాయాలవ్వడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
సోమవారం రాత్రి టౌన్స్‌విల్లేలోని పామ్ ఐలాండ్‌లో 51 ఏళ్ల మహిళపై దారుణమైన దాడి జరిగింది. పేరు వెల్లడించని మహిళ మెడ, తల, చేయిపై కూడా కుక్కలు కొరికాయని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె చేయి విరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళ పరిస్థితి విషమించడంతో టౌన్స్‌విల్లే యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించారు.
ఆకలితో వీగన్ రా ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి...
సోమవారం రాత్రి 11:10 గంటలకు సెయిలర్ స్ట్రీట్ లో దాడి జరిగిందని ఎమర్జెనీ సర్వీసెస్ కు ఫోన్ వచ్చింది. దాడిలో ఆమె కుడి చెవి మొత్తం కోల్పోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు.
ఈ దాడి చేసిన మూడు కుక్కలను గుర్తించామని.. వాటిని చంపేసినట్లుగా పామ్ ఐలాండ్ అబోరిజినల్ షైర్ కౌన్సిల్ ధృవీకరించింది. అంతేకాకుండా, మిగతా కుక్కలు ఇలా చేయకుండా అరికట్టడానికి కౌన్సిల్ ఉప చట్టాలను పాటించాలని యజమానికి నోటీసులు ఇచ్చారు.
లండన్‌లో జూన్‌లో ఏడేళ్ల బాలుడిపై జర్మన్ షెపర్డ్ దాడి చేసింది. విషయం తెలిసి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నప్పుడు మరోవ్యక్తి.. తనపై కూడా ఆ కుక్క దాడి చేసిందని ఫిర్యాదు చేశారు. కుక్కల దాడి బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని పోలీసులు తెలిపారు.
ఏప్రిల్‌లో, "పిట్‌బుల్ లాంటి" కుక్క ఒక వ్యక్తి పెంపుడు జంతువును చంపింది. యూకేలో అలాంటి మరొక విషాద సంఘటనకూడా నమోదయ్యింది. దక్షిణ లండన్‌లోని క్యాంబర్‌వెల్‌లో సోమవారం ఈ దాడి జరిగింది. ఆ మహిళ తన పెంపుడు కుక్క రాకీతో బైటికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
