నడుస్తున్న రైలు కిందపడ్డ యువతి.. సచ్చి బతకటం అంటే ఇదేనేమో.. వైరల్ వీడియో !

Viral Video: ఓ షాకింగ్ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఒక యువతి రైలు కోసం ప్లాట్ ఫామ్ మీద నిలబడింది. రైలు అక్క‌డ‌కు చేరుకున్న క్ర‌మంలో  ప్లాట్ ఫామ్ మీద నిలబడిన యువతి ఒక్కసారిగా రైలు కింద పడింది. చివరకు పెద్ద గాయాల్లేకుండానే ప్రణాలతో బయటపడింది. 
 

Woman Faints And Falls Under Moving Train, Says She's Reborn

Woman Faints And Falls Under Moving Train: సచ్చి బతకటం అంటే ఇదేనేమో.. అనే త‌ర‌హా ఓ షాకింగ్ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్లాట్ ఫామ్ మీద నిల‌బ‌డి ఉన్న ఓ యువ‌తి స్పృహతప్పి  కదులుతున్న రైలు కింద పడింది.. ఇక్కడే ఓ అద్భుతం జ‌రిగింది. రైలు కింద ప‌డిన స‌ద‌రు యువ‌తి స్వ‌ల్ప  గాయాల‌తో ప్రాణాలతో బయటపడింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న అర్జెంటీనాలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే..  అర్జెంటీనాలో బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇండిపెండెన్స్ రైల్వే స్టేషన్ లో  క్యాండేలా అనే యువ‌తి రైలు కోసం ప్లాట్ ఫామ్ మీద నిలబడింది. ఇంతలో రైలు స్టేష‌న్ లోకి వ‌చ్చింది. ఇంకా రైలు క‌దులుతూనే ఉంది. అయితే, ఈ క్రమంలోనే  ప్లాట్ ఫామ్ మీద నిలబడిన యువతి ఒక్కసారిగా రైలు కింద పడింది. ఆమెకు కళ్లు తిరిగి బ్యాలెన్స్ తప్పిపోయి రైలు కింద ప‌డిన ఆమెను అక్క‌డి ప్ర‌యాణికులు గుర్తించారు. అయితే, స‌ద‌రు మ‌హిళ అతి స్వ‌ల్ప గాయాల‌తో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యువ‌తికి పెద్ద గాయాలు కాలేదు. ఆమె ట్రైన్ కు, ప్లాట్ ఫామ్ కు మధ్య లో ఉండే ఖాళీ స్థలంలో పడటంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఆ దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన మార్చి 29న జరిగిందని అక్క‌డి అధికారులు పేర్కొన్నారు. మొద‌ట తీవ్రంగా భ‌య‌ప‌డిపోయిన అక్క‌డి ప్ర‌యాణీకులు.. స‌ద‌రు యువ‌తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన క్యాండేలా.. “నేను ఇంకా ఎలా బతికే ఉన్నానో నాకు తెలియదు. నేను ఇప్పటికీ అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఇది న‌మ్మ‌శ‌క్యంగా లేదు” అని పేర్కొంది. ప్రమాదం నుండి బయటపడిన తర్వాత తాను పునర్జన్మలా ఉంద‌ని ఆ యువ‌తి తెలిపింది. 

“నేను అకస్మాత్తుగా రక్తపోటుకు గుర‌య్యాను. ఈ క్ర‌మంలోనే స్పృహతప్పి  ప‌డిపోయాను. నేను నా ఎదురుగా ఉన్న వ్యక్తిని హెచ్చరించడానికి ప్రయత్నించాను, కానీ నేను రైలును ఢీకొట్టిన క్షణంలో కూడా ఇంకేమీ గుర్తులేదు” అని ఆమె ఓ టెలివిజన్ ఛానెల్ లో పేర్కొంది. కాండేలాను బ్యూనస్ ఎయిర్స్ ఆస్పత్రికి తరలించగా, ఆమె ప్రాణాపాయం నుండి బయటపడిందని వైద్యులు తెలిపారు.

గత నెలలో గుజరాత్‌లోని సూరత్‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. ప్లాట్‌ఫారమ్ మరియు కదులుతున్న రైలు మధ్య జారిపడి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ వ్యక్తి రైలు దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. అలాగే, దేశ‌రాజధాని ఢిల్లీలో మెట్రో రైలు పట్టాలపై పడిపోయిన వ్యక్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది రక్షించారు. సంఘటన వీడియో క్లిప్‌లో వ్యక్తి తన ఫోన్‌లో నిమగ్నమై ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తున్నట్లు క‌నిపించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios