Asianet News TeluguAsianet News Telugu

సొంత వీర్యంతో మహిళలకు గర్భం.. నా బయోలాజికల్ తండ్రి అతడే... ఫెర్టిలిటీ డాక్టర్ పై మహిళ ఫిర్యాదు...

1980లలో దాతల నుంచి సేకరించిన వీర్యంతో ఓ మహిళ గర్భం దాల్చారు.  రోచెస్టర్ కు చెందిన మోరిస్ వోర్ట్ మన్ అనే వైద్యుడు ఆమెకు ఈ చికిత్స అందించి గర్భందాల్చేలా చేశారు.  స్థానిక వైద్య విద్యార్ధి నుంచి సేకరించిన వీర్యాన్ని చికిత్సలో ఉపయోగించానని ఆ వైద్యుడు, ఆ సమయంలో తెలిపారు.

Woman accuses US fertility doctor of secretly using own sperm
Author
Hyderabad, First Published Sep 16, 2021, 7:47 AM IST

న్యూయార్క్ : సంతానం కోసం వచ్చిన మహిళను గర్భవతిని చేసేందుకు ఓ ఫెర్టిలిటీ డాక్టర్ దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా... రహస్యంగా సొంత వీర్యాన్ని వినియోగించాడని అమెరికాకు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కారు.  పలువురు మహిళలకు సైతం సొంత వీర్యాన్నే ఉపయోగించి గర్భం వచ్చేలా చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు డాక్టర్  మోరిస్ వోర్ట్ మన్  అనే వైద్యుడిపై న్యూయార్క్ కు చెందిన మహిళ కేసు దాఖలు చేసింది. 1980లలో దాతల నుంచి సేకరించిన వీర్యంతో ఓ మహిళ గర్భం దాల్చారు.  రోచెస్టర్ కు చెందిన మోరిస్ వోర్ట్ మన్ అనే వైద్యుడు ఆమెకు ఈ చికిత్స అందించి గర్భందాల్చేలా చేశారు.  స్థానిక వైద్య విద్యార్ధి నుంచి సేకరించిన వీర్యాన్ని చికిత్సలో ఉపయోగించానని ఆ వైద్యుడు, ఆ సమయంలో తెలిపారు.

అయితే,  నిజానికి అది మోరిస్ సొంత వీర్యమేనని.. అప్పుడు జన్మించిన ఆ మహిళ కుమార్తె ప్రస్తుతం ఆరోపిస్తున్నారు.  దీనిపైనే కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.  ఫిర్యాదు చేసిన మహిళ ప్రస్తుతం ఇదే వైద్యుల వద్ద  గైనకాలజీ చికిత్స తీసుకుంటున్నారు. 

‘అమెరికాపై అల్ ఖైదా మరోసారి దాడి చేయవచ్చు.. అఫ్ఘాన్‌లో బలపడానికి ప్రయత్నాలు చేస్తున్నది’

 1985లో తాను జన్మించినట్లు పేర్కొంటున్న ఆ మహిళ… డిఎన్ఎ జీనాలజీ ( తమ వంశంలోని వ్యక్తులను గుర్తించేందుకు  చేసే పరీక్ష)  పరీక్ష చేయించుకుంటే తనకు తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నట్లు తేలిందని ఆమె వివరించారు.  ఈ వ్యవహారంపై వైద్యుడు వోర్ట్ మన్ ఇప్పటి వరకు స్పందించలేదు.  ఆయన తరఫున మాట్లాడే న్యాయవాది వివరాలు సైతం వైద్యుడి కార్యాలయం వెల్లడించలేదు.

 నిజానికి,  గత కొన్నేళ్లలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇతరుల వీర్యం కాకుండా, సొంత వీర్యాన్ని చికిత్సలో ఉపయోగిస్తున్నారని కొందరు వైద్యులపై ఆరోపణలు వస్తున్నాయి. దాతల నుంచి సేకరించిన వీర్యం ద్వారానే చికిత్స అందిస్తున్నని చెప్పిన ఇండియానాకు చెందిన వైద్యుడు డొనాల్డ్ క్లైన్ పదుల సంఖ్యలో మహిళలకు సొంత వీర్యాని వినియోగించాడు.  

అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు  అతడి లైసెన్స్ను  ఏడాదిపాటు రద్దు చేసింది.  నెవాడలో జరిగిన ఇలాంటి ఉదంతంపై హెచ్ బీఓలో ‘బేబీ  గాడ్’ అనే డాక్యుమెంటరీ సైతం వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios