ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చిక్కిన ఎయిర్ మార్షల్ క్షేమంగా ఉన్నారు. పాక్ అధికారులు ఎయిర్ క్రాఫ్ట్ వివరాలు అడిగితే చెప్పేందుకు అభినందన్ నిరాకరించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని అభినందన్ ప్రకటించారు.  టీ తాగుతూ  కొందరు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్టుగా వీడియో ఉంది. పాక్ అధికారుల ట్రీట్‌మెంట్ బాగుందని అభినందన్ చెప్పారు. వీ విజన్ ఏంటని అభినందన్‌ను పాక్ అధికారులు అడిగారు. పెళ్లైందా అని కూడ ఆయనను అడిగారు. 

తనకు పెళ్లైందని అభినందన్ చెప్పారు.  అభినందన్‌ నడిపిన విమానం  ఏ రకమైందో పాక్ ఆర్మీ కూపీ లాగేందుకు ప్రయత్నాలు చేస్తే ఆ వివరాలను  చెప్పేందుకు ఆయన నిరాకరించారు. 

టీ ఎలా ఉందంటూ పాక్ అధికారులు అడిగితే ... టీ చాలా బాగుందని ఆయన  సమాధానమిచ్చారు.తాను దక్షిణ భారత దేశానికి చెందినవాడినని ఆయన చెప్పారు. అయితే అభినందన్ మనస్పూర్తిగా  ఆ మాటలు చెప్పాడా లేదా అనేది తేలాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే తమ ఆధీనంలో ఒక్క పైలట్ మాత్రమే ఉన్నాడని పాకిస్తాన్ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కానీ, బుధవారం మధ్యాహ్నం మాత్రం ఇద్దరు పైలట్లు తమ ఆధీనంలో ఉన్నారని ప్రకటించింది. సాయంత్రానిక మాట మార్చారు.