లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తాజాగా రాహుల్ చేసిన కొన్ని కామెంట్స్‌పై అగ్ర రాజ్యం అమెరికా కూడా స్పందించింది.

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తాజాగా రాహుల్ చేసిన కొన్ని కామెంట్స్‌పై అగ్ర రాజ్యం అమెరికా కూడా స్పందించింది.ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అనుసరిస్తున్న విదేశాంగ విధానం పాకిస్థాన్- చైనాల సంబంధాలను బలోపేతం చేసిందన్న రాహుల్ గాంధీ వాదనతో తాము ఏకీభవించబోమని అగ్ర రాజ్యం అమెరికా పేర్కొంది. దీనిని ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నట్టుగా తెలిపింది.

బుధవారం పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కోరినప్పుడు యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ (Ned Price) స్పందించారు. ‘పాకిస్థాన్‌, చైనా సంబంధాల గురించి మాట్లాడటానికి నేను దానిని ఆ రెండు దేశాలకే వదిలివేస్తాను. నేను ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలను సమర్థించను’ అని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ దేశమూ యునైటెడ్ స్టేట్స్, చైనాల‌లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం లేదని తాము అన్ని దేశాలకు ఇదివరకే చెప్పామని అన్నారు. 

‘పాకిస్తాన్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వంతో మాకు ముఖ్యమైన సంబంధం ఉంది. అనేక రంగాలలో మేము విలువైన సంబంధాన్ని కలిగి ఉన్నాము’ అని నెడ్ ప్రైస్ చెప్పారు.

ఇక, లోక్‌సభలో బుధవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థ నుంచి ఎన్నికల సంఘం వరకు ప్రతి సంస్థపై దాడి చేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే.. వారి గొంతును అణిచివేసేందుకు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్‌లను ప్రభుత్వ సాధనాలు మార్చుకుంద‌ని అన్నారు. ఇప్పుడు దేశంలో రెండు భారత్‌లు ఉన్నాయని.. ఒకటి పేదలదని, మరోకటి సంపన్నులదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రెండింటినీ కలిపేందుకు కృషి చేయాలని సూచించారు. 

‘గణతంత్ర దినోత్సవం రోజున ఎందుకు విదేశీ అతిథిని తీసుకురాలేకపోతున్నారో మీరే ప్రశ్నించుకోండి. మనం పూర్తిగా ఒంటరి అయ్యాయి. మీరు పాకిస్తాన్, చైనాలను ఏకతాటిపైకి తెచ్చారు. చైనాను, పాకిస్తాన్‌ను వేరు చేయడం భారత్‌ ఏకైక అతిపెద్ద వ్యూహాం. కానీ మోదీ ఆ రెండు దేశాలనూ కలిపారు. దాని వల్ల వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ. ఇది మీరు చేసిన అతిపెద్ద నేరం’ రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అన్నారు.