Asianet News TeluguAsianet News Telugu

నేనింకా వర్జిన్‌నే...అందుకే అమ్మాయిలను చంపుతా: ఫేస్ బుక్‌లో యువకుడి పోస్ట్

తనను ప్రేమించకుండా తిరస్కరించి అమ్మాయిలపై రివేంజ్ తీర్చకుంటానని...కేవలం వారిపైనే కాదు కనిపించిన ప్రతి అమ్మాయిని హతమార్చుతానంటూ ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. అయితే మరో వారం రోజుల్లో వాషింగ్టన్ లో మహిళలతో కూడాన భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ యువకుడి పోస్ట్ ఆందోళన కలిగించింది. అయితే ముందుగానే అప్రమత్తమైన అమెరికా పోలీసులు సదరు యువకున్ని అరెస్ట్ చేయడంతో ఆ గందరగోళానికి తెరపడింది. 

Will Kill As Many Girls As I See : US Man facebook Post
Author
Washington, First Published Jan 23, 2019, 12:36 PM IST

తనను ప్రేమించకుండా తిరస్కరించి అమ్మాయిలపై రివేంజ్ తీర్చకుంటానని...కేవలం వారిపైనే కాదు కనిపించిన ప్రతి అమ్మాయిని హతమార్చుతానంటూ ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. అయితే మరో వారం రోజుల్లో వాషింగ్టన్ లో మహిళలతో కూడాన భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ యువకుడి పోస్ట్ ఆందోళన కలిగించింది. అయితే ముందుగానే అప్రమత్తమైన అమెరికా పోలీసులు సదరు యువకున్ని అరెస్ట్ చేయడంతో ఆ గందరగోళానికి తెరపడింది. 

 ఇలా తన వివాదాస్పద పేస్ బుక్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా గందగోళానికి కారణమైన యువకున్ని క్రిస్టోఫర్‌ డబ్ల్యూ క్లిరీగా గుర్తించారు. ఇతడు ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడు‘ఇంపల్స్‌ కంట్రోల్‌ డిసర్డార్‌’అనే వ్యాధితో బాధపడుతున్నట్లు... ప్రతి చిన్న  విషయానికి అతిగా ప్రవర్తించడం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఈ వ్యాధి స్వభావంగా తెలిసింది.

అయితే గతకొంత కాలంగా అమ్మాయిలెవరూ తనను ప్రేమించడం క్లీరీ మనోవేధనకు గురయ్యాడు. అందువల్లే తాను ఇప్పటికీ వర్జిన్ గానే మిగిలిపోయానని  ఆవేధన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వారిపై కోపాన్ని పెంచుకుని తాను ఆత్మహత్య చేసుకునేలోపు ఎంత ఎక్కువయితే అంత మంది అమ్మాలయిలను హతమార్చాలనుకున్నాడు. ఇదే విషయాన్ని పేర్కొంటూ తన ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు.

తనను రిజెక్ట్ చేసిన ప్రతి  అమ్మాయికి తగిన గుణపాఠం చెబుతానని...వారిని అతి క్రూరంగా చంపుతానన్నాడు. వారితో పాటే తనకేదురుపడ్డ ప్రతి అమ్మాయిని హతమార్చాలని ప్లాన్ చేసుకున్నానన్నాడు. ఎలాగూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నా కాబట్టి ఆ లోపు చాలామంది అమ్మాయయిలను చంపుతానంటూ  క్లిరి వివాదాస్పద ప్రకటనతో సంచలనం రేపాడు. 

దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి  నిందితుడిని గుర్తించారు. క్లిరీ నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios