అమెరికా కాంగ్రెస్‌లో అడుగుపెట్టనున్న ఇండియన్!

Will Indian-American Engineer Win US Congress Seat?
Highlights

అమెరికాలో భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు. భారత సతంతకి చెందిన ఓ మహిళ అమెరికన్ కాంగ్రెస్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.

అమెరికాలో భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు. భారత సతంతకి చెందిన ఓ మహిళ అమెరికన్ కాంగ్రెస్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో పుట్టిన తెలుగమ్మాయి అరుణా మిల్లర్ ఇప్పుడు అమెరికా చట్ట సభలలో కాలు మోపేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికాలో స్థిరపడిన అరుణా మిల్లర్ ప్రస్తుతం మేరీల్యాండ్ నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే వాషింగ్టన్ రాష్ట్రం నుంచి అమెరికా ప్రతినిధుల సభలోకి ప్రవేశించనున్న రెండో ప్రవాస భారతీయ మహిళగా ఆమె నిలువనున్నారు.

ఇప్పటికే వాషింగ్టన్ నుంచి గెలుపొందిన ప్రమీలా జయపాల్ దిగువసభ సభ్యురాలుగా ఉన్నారు. కాగా.. ఈ సారి పార్టీలో అరుణా మిల్లర్‌కు గట్టి పోటీనే ఉంది, అయినప్పటికీ ఆమె నెగ్గడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేరీల్యాండ్‌ లోని డెమొక్రాట్ల కంచుకోట అయిన ఆరో జిల్లా ప్రైమరీకి ఆమె పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి డేవిడ్‌ ట్రోన్‌. ఈ గెలుపు కోసం ట్రోన్ రూ. 65 కోట్లు ఖర్చు చేశారట. కానీ అరుణ మాత్రం కేవలం రూ.9కోట్లు ఖర్చుపెట్టారు. మంగళవారం నాడు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

అరుణా మిల్లర్ తనకు ఏడేళ్లున్నప్పుడే తన తండ్రితోపాటు అమెరికాకు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 53 ఏళ్లు. వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్ అయిన అరుణా మిల్లర్ మన తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడగలదు. వర్జీనియా, హవాయ్, కాలిఫోర్నియాలతోపాటు మౌంట్‌గొమెరీ కౌంటీలో పాతికేళ్లపాటు రవాణాశాఖలో ఇంజినీరుగా ఆమె సేవలందించారు. ఆ తర్వాత 2015లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమణ పొంది, పూర్తిస్థాయిలో మేరీల్యాండ్ నియోజకవర్గం నుంచి రాజయకీయ అరంగేట్రం చేశారు.

loader