ఏడాది చివరికల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్: ట్రంప్ వెల్లడి

ఈ ఏడాది చివరికల్లా అమెరికా కోరనా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశోధకులు ఆ దిశగా పనిచేస్తున్నట్లు ఆయన  తెలిపారు.

Will have Coronavirus vaccineny end of the year: Donald Trump

వాషింగ్టన్:  ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరికల్లా తమకు కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే విశ్వాసం ఉందని ఆయన చెప్పారు వాషింగ్టన్ డీసిలోని లింకన్ మెమోరియల్ నుంచి ఫాక్స్ న్యూస్ టౌన్ హాల్ షోలో మాట్లాడుతూ ఆయన ఆ ధీమా వ్యక్తం చేసారు. 

పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు సెప్టెంబర్ లో తెరుచుకుంటాయని, తిరిగి అవి పనిచేయాలని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. అమెరికా వ్యాక్సిన్ తయారు చేయడానికి ముందుకు సాగుతోందని, ఈ దిశలో ఇతర దేశాలు కూడా ముందుకు సాగాలని ఆయన అన్నారు. 

మందు కనిపెట్టడంలో అమెరికా పరిశోధకులను ఇతర దేశాలు అధిగమించినా తాను సంతోషిస్తానని, ఇతర దేశాలు ఆ పని చేస్తే తాను అభినందిస్తానని ఆయన చెప్పారు. ఎవరు కనిపెట్టినా తనకేమీ అభ్యంతరం లేదని, తనకు కావాల్సింది వ్యాక్సిన్ అని ఆయన అన్నారు. 

పరిశోధనల్లో భాగాంగా మనుషులపై వ్యాక్సిన్ ను ప్రయోగించే విషయంలో ప్రమాదం ఉండవచ్చు కదా అని అంటే వాళ్లు వాలంటీర్లు అని, వారు ఏం తీసుకుంటున్నారో వారికి తెలుసునని ఆయన అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios