Asianet News TeluguAsianet News Telugu

స్ట్రైయిన్ వైరస్ పై కరోనా వ్యాక్సిన్ పనిచేస్తుందా..?

ఇక కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌స్తున్న వ్యాక్సిన్లు కొత్త స్ట్రైయిన్ వైర‌స్‌పై పనిచేస్తాయా లేదా అనే సందేహం అందరిలోనూ ఉంది. ఒకవేళ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి..? మళ్లీ ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది..? 

Will COVID19 vaccines work on new coronavirus variant? here what US health Expert say
Author
Hyderabad, First Published Dec 30, 2020, 9:41 AM IST

ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుంటే మ‌రో వైపు కొత్త ర‌కం స్ట్రైయిన్ వైర‌స్ మ‌రింత భ‌య‌పెట్టిస్తోంది. క‌రోనాను అరిక‌ట్టేందుకు భార‌త్‌తో పాటు ప్ర‌పంచ దేశాలు సైతం వ్యాక్సిన్ త‌యారీలో త‌ల‌మున‌క‌ల‌వుతున్నాయి. ఈ వ్యాక్సిన్ బ‌య‌ట‌కు రాక‌ముందే మ‌రో కొత్త వైర‌స్ ద‌డ పుట్టిస్తోంది. 

గతేడాది చైనా లో కరోనా వైరస్ పుట్టి ప్రపంచ దేశాలకు పాకేయగా.. తాజాగా..స్ట్రైయిన్ వైరస్ యూకే నుంచి ఇతర దేశాలకు చుట్టేస్తోంది. కాగా.. కోవిడ్ మహమ్మారికి భార‌త్‌లో ప‌లు వ్యాక్సిన్లు తుది ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో వ్యాక్సినేష‌న్ ప్రారంభిస్తామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇక కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌స్తున్న వ్యాక్సిన్లు కొత్త స్ట్రైయిన్ వైర‌స్‌పై పనిచేస్తాయా లేదా అనే సందేహం అందరిలోనూ ఉంది. ఒకవేళ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి..? మళ్లీ ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది..? ఆలోపు ఎంత మంది ఈ వైరస్ కి బలికావాల్సి వస్తుందో అనే భయం ప్రజల్లో మొదలైంది. కాగా.. ఈ అనుమానాలపై యూకే ఆరోగ్య నిపుణులు స్పందించారు. 

కొత్త వైరస్ ని వ్యాక్సిన్ ఎదుర్కొంటుందని బ్రిటన్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. దానిపై ఎవరికీ నమ్మకం కలగడం లేదు. ఈ క్రమంలో.. ఈ విషయంపై యూఎస్ పరీక్షలు చేయడం మొదలుపెట్టింది.

ఈ కొత్త వైరస్ పాత దానికంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. అది దాని వేరియంట్ ని మార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో.. అసలు ఈ కొత్త వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాప్తిస్తోంది.. దానిని అది ఎలా మార్చుకుంటోందనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కాగా.. ఈ కొత్త వైరస్ పెద్ద సమస్యగా మారకపోవచ్చని యూఎస్ ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ విషయంపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఇక కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌స్తున్న వ్యాక్సిన్లు కొత్త స్ట్రైయిన్ వైర‌స్‌పై ప‌ని చేయ‌వ‌ని ఎలాంటి ఆధారాలు లేవ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. వ్యాక్సిన్ స్ట్రైయిన్‌పై కూడా ప‌ని చేస్తుంద‌ని భార‌త ప్ర‌భుత్వ ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ ప్రొఫెస‌ర్ కె. విజ‌య్ రాఘ‌వ‌న్ తెలిపారు. అయితే ముందు ఎదుర్కొన్న క‌రోనా వైర‌స్‌తో పోల్చుకుంటే ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఇత‌రుల‌కు వేగంగా సోకే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్నారు.

క‌రోనా రూపాంత‌రం చెంది స్టైయిన్ వైర‌స్‌గా మారిన‌ప్ప‌టికీ, ఆ వైర‌స్ కేవ‌లం మ‌నిషి రోగ నిరోధ‌క శ‌క్తిని మాత్ర‌మే త‌గ్గించ‌గ‌ల‌ద‌ని, వ్యాక్సిన్ ప‌ని చేయ‌కుండా ఉండే ప‌రిస్థితి ఏమి లేద‌ని అన్నారు. కానీ క‌రోనా వైర‌స్ రూపాంత‌రం చెందుతున్న‌త‌రుణంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం ఉంటూ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిద‌ని సూచించారు. యూకేలోఎ వెలుగు చూసిన కొత్త స్ట్రైయిన్ వైర‌స్ అక్క‌డి నుంచి భార‌త్‌కు వ‌చ్చిన వారిలో ఆరుగురికి సోకింది. వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం యూకే నుంచి భార‌త్‌కు వ‌చ్చే విమానాలపై సైతం నిషేధం విధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios