Wildfires: అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సంతో ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపించడంతో ప్రజలు ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశారు. మావీయ్ ద్వీపంలో పరిస్థితులు దారుణంగా మారాయి. పలువురు పొగ, మంటల నుంచి తప్పించుకోవడానికి సముంద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
Hawaii wildfires: అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సంతో ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపించడంతో ప్రజలు ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశారు. మావీయ్ ద్వీపంలో పరిస్థితులు దారుణంగా మారాయి. పలువురు పొగ, మంటల నుంచి తప్పించుకోవడానికి సముంద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
సంబంధిత మీడియా కథనాల ప్రకారం.. హవాయిలోని మావీయ్ ద్వీపంలోని రిసార్ట్ సిటీ లాహైనాలో సుదూర హరికేన్ నుంచి వీచిన కార్చిచ్చు బీభత్సం సృష్టించడంతో 36 మంది మృతి చెందారని మావీయ్ కౌంటీ ఒక ప్రకటనలో తెలిపింది. ద్వీపం పశ్చిమ భాగంలో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అనేక పరిసరాలు కాలిబూడిదయ్యాయి. లాహైనా, దాని నౌకాశ్రయం, పరిసర ప్రాంతాలకు విస్తృతమైన వినాశనం జరుగుతుందని అధికారులు చెప్పడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఒక రహదారి మాత్రమే తెరిచి ఉంచిన అక్కడి అధికార యంత్రాంగం.. వేలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పొగ, మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు సముద్రంలోకి పరుగులు తీశారు.
"నేను చూసిన అత్యంత ఘోరమైన విపత్తు మాకు ఎదురైంది. లాహైనా మొత్తం కాలిపోయింది. అదొక అపోకలిప్స్ లాంటిది' అని నగరం విడిచివచ్చిన లహైనా నివాసి మాసన్ జార్వీ అన్నారు. లాహైనా నదీ తీరం వెంబడి అక్కడి కార్చిచ్చు విధ్వంసానికి సంబంధించి తీసిన చిత్రాలను జార్వీ రాయిటర్స్ కు చూపించారు. షార్ట్స్ ధరించి, తన కుక్కను రక్షించడానికి తన ఎలక్ట్రిక్ బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు తన తొడపై బొబ్బలు కనిపించాయని చెప్పాడు. మావీయ్ లోని అతిపెద్ద పర్యాటక కేంద్రం, పలు పెద్ద హోటళ్లకు నిలయమైన లాహైనా బ్లాక్ తర్వాత బ్లాక్ నుంచి పొగలు ఎగసిపడుతున్నట్లు ఏరియల్ వీడియోలో చూపించారు. "ఇది ఒక ప్రాంతంపై బాంబు దాడి జరిగినట్లు ఉంది. ఇది యుద్ధ ప్రాంతం లాంటిది' అని హెలికాప్టర్ పైలట్ రిచర్డ్ ఓల్ స్టెన్ అన్నారు.
