Asianet News TeluguAsianet News Telugu

అదృష్టం అంటే ఇతనిదే... భార్య మాట విన్నందుకు కోట్లు వరించాయి..!

భార్య చెప్పినట్లు అతను సరుకులు తీసుకురావడానికి వెళ్లాడు. అయితే.. అక్కడే అతనికి అదృష్టం కలిసొసచ్చింది. రూ. కోట్లు విలువచేసే లాటరీ గెలుచుకున్నాడు. 

Wife Sends Man To Grocery Store, He Wins $190,736 In Lottery
Author
First Published Oct 3, 2022, 10:38 AM IST

చాలా మంది భర్తలు తమ భార్యలు చెప్పిన పనులు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ... ఒక్కోసారి వాళ్లు చెప్పిన పని చేయడం వల్ల అదృష్టం కలిసొచ్చే అవకాశం కూడా ఉంది. ఓ వ్యక్తిని.. అతని భార్య  సరుకులు తీసుకురమ్మని మెసేజ్ చేసింది. భార్య చెప్పినట్లు అతను సరుకులు తీసుకురావడానికి వెళ్లాడు. అయితే.. అక్కడే అతనికి అదృష్టం కలిసొసచ్చింది. రూ. కోట్లు విలువచేసే లాటరీ గెలుచుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


యుఎస్‌లోని మిచిగాన్ నివాసి ప్రెస్టన్ మాకీ  తన రోజువారీ కార్యాలయ పనిని ముగించుకుని ఉండగా, కిరాణా దుకాణం నుండి కొన్ని వస్తువులను తీసుకురావాలని అతని భార్య నుండి సందేశం వచ్చింది. ప్రెస్టన్ మాకీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దుకాణానికి వెళ్లాడు. అయితే... అక్కడ అతనికి లాటరీ తగలడంతో... అతనికి $190,736 గెలుచుకున్నాడు. దీంతో... అతని జీవితమే మారిపోయింది.

ప్రెస్టన్ మాకీ దుకాణంలో 5 లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అతను సరుకులు తీసుకొని ఇంటికి వెళ్లాడు. తర్వాతిరోజు ఏదో పని చేస్తుండగా ప్రెస్టన్‌ కు లాటరీ టికెట్‌ గురించి గుర్తుకొచ్చింది. దానితో ఫోన్‌ తీసుకుని లాటరీకి చెందిన మొబైల్‌ యాప్‌ ఓపెన్‌ చేసి టికెట్‌ నంబర్‌ ను స్కాన్‌ చేశాడు. తనకు బహుమతి వచ్చిందని గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఆ లాటరీ టికెట్‌ కు 1,90,736 డాలర్లు (మన కరెన్సీలో సుమారు 1.5 కోట్ల రూపాయలు బహుమతి వచ్చింది. దీంతో.. ఆనందంతో గంతులు వేశాడు. మొదట నమ్మలేకపోయానని.. మళ్లీ మళ్లీ చెక్ చేసుకున్నానని చెప్పడం గమనార్హం.

తన భార్య సరుకులు తెమ్మని చెప్పకపోతే..తాను వెళ్లి అక్కడ ఉన్న లాటరీ టికెట్లు కొనేవాడిని కాదని అతను చెప్పడం గమనార్హం. తన భార్య  కారణంగానే తాను ఈ లాటరీ గెలుచుకున్నానంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మామూలుగా అయితే... అతను లాటరీ కొనడట. కానీ.. ఆ రోజు ఎందుకో వాటిని చూడగానే లాటరీ కొనాలి అనిపించి కొన్నాడట. అతనికి లాటరీ తగలడం పట్ల కుటుంబ సభ్యులు సైతం సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios