Asianet News TeluguAsianet News Telugu

Bharat Biotech: ఐరాస సంచ‌ల‌న నిర్ణ‌యం.. కొవ్యాక్సిన్‌ సరఫరా నిలిపివేత.. కార‌ణ‌మదేనా?

Bharat Biotech: భారత్‌ బయోటెక్‌ ‘కొవ్యాక్సిన్‌’ సరఫరాను నిలిపివేస్తున్న‌ట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్ర‌క‌టించింది. భారత్‌ బయోటెక్‌ ప్లాంట్లలో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యమైన తయారీ పద్ధతుల్లో లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టంచేసింది. మొత్తం మీద కొవ్యాక్సిన్‌ ప్రభావశీలమైందని, భద్రతాపరమైన సమస్యలేవీ లేవని తేల్చి చెప్పింది.    
 

WHO Suspends UN Supply Of Covaxin No Impact On Efficacy, Says Bharat Biotech
Author
Hyderabad, First Published Apr 4, 2022, 5:36 AM IST

Bharat Biotech: కరోనా క‌ష్ట‌కాలంలో భారత ప్రభుత్వం సహకారంతో పనిచేసే భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ను ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థల ద్వారా సరఫరా నిలిపివేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) ప్రకటించింది. మార్చి 14-22 తేదీల మధ్య భారత్‌ బయోటెక్‌ ప్లాంట్లలో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యమైన తయారీ పద్ధతుల (జీఎంపీ)కు సంబంధించిన లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ఈ మేర‌కు బీఎంపీ ప్ర‌మాణాల‌కు అనుకులంగా అప్‌గ్రేడ్ చేయడానికి,  తనిఖీలో కనుగొనబడిన  లోపాలను భారత్ బయోటెక్ సరిదిద్దుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

WHO ప్రకారం..ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీల ద్వారా భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ సరఫరా నిలిపివేతను నిర్ధారిస్తోంది. తగిన విధంగా చర్యలు తీసుకోవాలని టీకాను స్వీకరించిన దేశాలకు సిఫార్సు చేస్తోంది. వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉందని, ఎటువంటి భద్రతా సమస్యలు లేవని WHO తెలిపింది, అయితే ఎగుమతి కోసం ఉత్పత్తిని నిలిపివేయడం వలన కోవాక్సిన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. మార్చి 14 నుంచి 22 వరకు నిర్వహించిన పోస్ట్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయుఎల్) తనిఖీ ఫలితాల నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఐరాస ద్వారా ఎగుమతిని నిలిపివేయడం వల్ల కొవాగ్జిన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది

 కొవాగ్జిన్ సరఫరాను నిలిపేస్తూ డబ్ల్యూహెచ్‌వో తీసుకున్న నిర్ణయంపై హైదరాబాదీ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ స్పందించింది. తమ కరోనా టీకా కొవాగ్జిన్‌ సామర్థ్యం, భద్రతపై ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది.  కోవాక్సిన్‌ను స్వీకరించిన మిలియన్ల మందికి, వ్యాక్సిన్ యొక్క సమర్థత, భద్రతపై ఎటువంటి ప్రభావం లేనందున జారీ చేసిన వ్యాక్సిన్ సర్టిఫికేట్లు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయి" అని భారత్ బయోటెక్ ప్రకటనలో తెలిపింది. భారత్ బయోటెక్ ఫెసిలిటీ ఆప్టిమైజేషన్ కోసం కోవాక్సిన్ ఉత్పత్తిని నెమ్మదిస్తోందని తెలిపింది. "రాబోయే కాలానికి కంపెనీ పెండింగ్‌లో ఉన్న ఫెసిలిటీ మెయింటెనెన్స్, ప్రాసెస్, ఫెసిలిటీ ఆప్టిమైజేషన్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తుందని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios