Asianet News TeluguAsianet News Telugu

నిద్రలో కరోనా వైరస్ ఏమీ చెయ్యదట... పాక్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ క్ర‌మంలో అక్క‌డ ఓ రాజ‌కీయ నాయ‌కుడు వైర‌స్‌పై విచిత్ర‌ వ్యాఖ్య‌లు చేశారు. "నువ్వు ఎంత‌సేపు పడుకుంటే క‌రోనా అంత‌సేపు నిద్రిస్తుంది. మ‌నం చ‌నిపోతే క‌రోనా చ‌నిపోతుంది. అంతే.. " అంటూ విచిత్ర కామెంట్స్ చేశారు.
 

when we sleep, virus sleeps too: pakistan cleric's bizarre covid19 logic sparks laugh riot on twitter
Author
Hyderabad, First Published Jun 15, 2020, 12:43 PM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తోంది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ లోనూ దీని ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. అటు పొరుగు దేశ‌మైన పాకిస్తాన్ క‌రోనాను ఎదుర్కోలేక ప‌త‌న‌మ‌వుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో కొట్టుమిట్టాడుతోంది. 

ఈ క్ర‌మంలో అక్క‌డ ఓ రాజ‌కీయ నాయ‌కుడు వైర‌స్‌పై విచిత్ర‌ వ్యాఖ్య‌లు చేశారు. "నువ్వు ఎంత‌సేపు పడుకుంటే క‌రోనా అంత‌సేపు నిద్రిస్తుంది. మ‌నం చ‌నిపోతే క‌రోనా చ‌నిపోతుంది. అంతే.. " అంటూ విచిత్ర కామెంట్స్ చేశారు.

"నిద్రించే స‌మ‌యంలో వైర‌స్ ఎలాంటి హాని చేయ‌దు. పైగా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డానికి ఎక్కువ గంట‌లు నిద్ర‌పోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు" అంటూ పాకిస్తాన్ నేష‌న‌ల్ అసెంబ్లీ స‌భ్యుడు ఫ‌జ‌ల్ ఉర్ రెహ్మాన్ పేర్కొన్నారు.. ఈ వీడియోను పాక్ జ‌ర్న‌లిస్టు నైలా ఇనాయ‌త్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

 దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ.. "అవును, ఈ మాట‌లు వింటే క‌రోనా నిజంగానే చ‌నిపోతుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఇంత‌కీ ప‌రిష్కారం ఏంటంటారు? ఇప్పుడు మ‌నం నిద్ర‌పోవాలా? చచ్చిపోవాలా?" అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios