Asianet News TeluguAsianet News Telugu

క్లాత్ మాస్కులు కొంపముంచుతాయి.. 20 నిమిషాల్లోనే ఒమిక్రాన్ బారిన పడేస్తాయి.. తాజా అధ్యయనం..

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ తన కోరలు చాచి ప్రళయం సృష్టిస్తున్న నేపథ్యంలో.. మాస్క్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏ రకమైన మాస్కులు.. ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయన్న అంశం పరిగణలోకి తీసుకుంటున్నారు.శాస్త్రవేత్తలు, నిపుణులు ఇటీవల మాస్కుల మీద చేసిన పరిశీలనల ప్రకారం, క్లాత్ మాస్కులు వైరస్ నుండి తగినంత రక్షణను అందించకపోవచ్చని తేలింది.

wearing a cloth mask takes only 20 minutes to get Covid Infection.. new study reveals
Author
Hyderabad, First Published Jan 8, 2022, 8:30 AM IST

omicron ఒకరినుంచి ఒకరికి సోకడానికి కేవలం 20 నిమిషాలు చాలని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఇద్దరు వ్యక్తులు maskలు లేకుండా ఉంటే... వారిలో ఒకరికి ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, 15 నిమిషాల్లో ఆ  Infection మరొకరికి వ్యాపిస్తుందని ఈ study  data చూపిస్తుంది. ఇక రెండో వ్యక్తి cloth mask వేసుకుంటే వైరస్ సోకడానికి 20 నిమిషాల సమయం పడుతుందని తేల్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ తన కోరలు చాచి ప్రళయం సృష్టిస్తున్న నేపథ్యంలో.. మాస్క్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏ రకమైన మాస్కులు.. ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయన్న అంశం పరిగణలోకి తీసుకుంటున్నారు. దీనిమీద మళ్లీ కొలమానాలు మొదలయ్యాయి. కారణం ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునే మొదటి రక్షణ కవచం మాస్కేనని మరోసారి రుజువు కావడమే. శాస్త్రవేత్తలు, నిపుణులు ఇటీవల మాస్కుల మీద చేసిన పరిశీలనల ప్రకారం, క్లాత్ మాస్కులు వైరస్ నుండి తగినంత రక్షణను అందించకపోవచ్చని తేలింది.

అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిస్ట్స్ ప్రకారం, వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా గరిష్ట రక్షణను అందించడానికి N95 మాస్క్‌లు ఉత్తమమైనవి. ఇన్ ఫెక్షన్ సోకిన వ్యక్తి మాస్క్ కూడా ధరించకపోయినా.. అవతలి వ్యక్తి మాస్క్ వేసుకుంటే.. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వైరస్ సంక్రమించడానికి కనీసం 2.5 గంటలు పడుతుంది. 

ఒకవేళ ఇన్ ఫెక్షన్ సోనిక వ్యక్తి.. ఎదుటి వ్యక్తి ఇద్దరూ N95 మాస్క్‌లు ధరించినట్లయితే, వైరస్ వ్యాప్తి చెందడానికి 25 గంటలు పడుతుంది. ఇక సర్జికల్ మాస్క్‌లు క్లాత్ మాస్క్ కంటే మెరుగైన రక్షణను అందిస్తాయి. ఈ విషయంలో కూడా ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి మాస్క్ ధరించకపోతే.. రెండవ వ్యక్తి సర్జికల్ మాస్క్ ధరించినట్లయితే, ఇన్‌ఫెక్షన్ 30 నిమిషాల్లో అవతని వ్యక్తికి వ్యాపిస్తుంది.

Omicron వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్ అప్ గ్రేడ్ చేయండి.. ఎందుకంటే... 

చాలామంది మాస్క్ వల్ల ఊపరి ఆడడం లేదనో.. ఏదోలాంటి వాసన వస్తుందనో.. స్కిన్ పాడవుతుందనో.. అనేక కారణాల వల్ల తమ సౌలభ్యం కోసం N95 కంటే క్లాత్ మాస్క్‌ని ఎంచుకుంటున్నారు. దీంతో నిపుణులు సర్జికల్ మోడల్‌లతో పాటు క్లాత్ మాస్క్‌లను జత చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఇక క్లాత్ మాస్కుల విషయానికి వస్తే.. కేవలం ఒక లేయర్ ఉన్న క్లాత్ మాస్క్‌లు larger dropletsను నిరోధించగలవు.. కానీ చిన్నగా ఉండే ఏరోసోల్‌లను క్లాత్ షీల్డ్ లు నిరోధించలేవు.  క్లాత్ మాస్క్ లేదా సర్జికల్ మాస్క్ లు రెండింటి విషయంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ ను ఎక్కువగా వ్యాప్తి చెందించే విషయంలో.. తొందరగా సోకే విషయంలో పెద్దగా తేడా ఉండదు.

ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా క్లాత్ మాస్క్‌లు ఎందుకు ప్రభావవంతంగా ఉండకపోవచ్చు..అంటే..

Omicron అనేది SARs-CoV-2 కు చెందిన అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్. రెండు, మూడు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకున్నవారు కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు. కాబట్టి, మాస్కింగ్‌తో ప్రారంభించి Covid-appropriate behaviourతో రక్షణలోని మొదటి జాగ్రత్తలను సరిగా తీసుకోవాలి. ఇద్దరు వ్యక్తులు మాస్క్ ధరించకపోతే.. వారిలో ఒకరికి ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, 15 నిమిషాల్లో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని డేటా చూపిస్తుంది. రెండో వ్యక్తి క్లాత్ మాస్క్ వేసుకుంటే వైరస్ సోకడానికి 20 నిమిషాలు పడుతుంది. ఇద్దరూ క్లాత్ మాస్క్‌లు ధరించినట్లయితే, 27 నిమిషాల్లో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios