వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఇప్పటికే మనం విజయం సాధించాం, ఈ ఎన్నికల్లో విజయం సాధించలేరని డెమోక్రట్లకు తెలుసునని ఆయన చెప్పారు.

బుధవారం నాడు ఉదయం ఆయన వైట్‌హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వారు గెలవలేరని డెమోక్రట్లకు తెలుసు.. అందుకే కోర్టుకు వెళ్తారని  అన్నారన్నారు. ఈ విషయాన్ని తాను చాలా రోజుల క్రితమే గుర్తించినట్టుగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఈ రాత్రి తరువాత అక్రమంగా ఓట్ల లెక్కింపు చేయడాన్ని  నిలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. తన గెలుపు లాంఛనమే అన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ జరుగుతోందన్నారు. ఓటింగ్ ద్వారా ప్రజలు ఏం కోరుకొన్నారో తెలిసిందన్నారు ట్రంప్

ఎన్నికల ఫలితాలపై కుట్ర జరుగుతోందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కోట్లాడి మంది ఉన్న టెక్సాస్ లో మనమే గెలిచామన్నారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకొందామని ఆయన చెప్పారు.

also read:ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు: ట్వీట్ల తొలగింపు

ఫ్లోరిడా, టెక్సాస్ లో గెలిచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుుర్తు చేశారు.  మాకు వస్తున్న ఫలితాలు అద్భుతమన్నారు. మనమే గెలవబోతున్నామని ఆయన తెలిపారు.

అమెరికన్లందరికీ ధన్యవాదాలు చెప్పారు ట్రంప్. సీట్లు కొల్లగొట్టాలనే డెమోక్రాట్ల ప్రయత్నాలు ఫలించవని ఆయన తేల్చి చెప్పారు.నార్త్ కరోలీనాలో ఘన విజయం సాధించామన్నారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.