అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు ఉదయం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు ఉదయం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

డెమోక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ సీట్లను దొంగిలించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.ఈ ప్రయత్నాన్ని ఎప్పటికీ కూడ నెరవేరనీయబోమని ఆయన ప్రకటించారు. పోలింగ్ పూర్తైన తర్వాత ఓట్లు వేయకూడదన్నారు. ఇవాళ రాత్రికి పెద్ద ప్రకటన చేస్తానని ఆయన ప్రకటించారు. భారీ విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

ట్రంప్ చేసిన ఈ ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. ఈ వ్యాఖ్యలు ఎన్నికల్ని తప్పుదోవపట్టించేలా ఉన్నాయని ట్విట్టర్ దీన్ని ఇతరులకు వెళ్లకుండా నిలిపివేసింది..ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించేలా ఈ ట్వీట్ ఉందని ట్విట్టర్ ప్రకటించింది.

also read:భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి: మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నిక

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం నాడు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత బుధవారం నాడు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ట్రంప్ ఇప్పటి వరకు 21 రాష్ట్రాల్లో విజయం సాధించాడు. బైడెన్ 19 రాష్ట్రాల్లో గెలుపొందారు.

డెమోక్రటిక్ అభ్యర్ధి తన మద్దతుదారులతో మాట్లాడుతూ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేసిన తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు.ప్రతి ఓటు లెక్కించేవరకు ఓపికపట్టాలని మద్దతుదారులకు బైడెన్ చెప్పారు. 

ఇది నేనో ట్రంపో నిర్ణయించటం కాదు... విశ్వాసం ఉంచండి.. మనం గెలవబోతున్నామని బైడెన్ తన మద్దతుదారులతో అన్నారు.