ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత దేశంలో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నాయి. 

కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని రాహ్ట్రాలు కూడా ముఖ్యంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతోపాటు దాదాపుగా షట్ డౌన్ విధించాయి. తెలంగాణ నుండి ఢిల్లీ వరకు ఈ రకమైన నిషేధాజ్ఞలను విధించాయి ఆయా ప్రభుత్వాలు. 

Also read: ఐసొలేషన్ లో ఉండకుండా తప్పించుకున్న కరోనా సోకిన టెక్కీ భార్య అరెస్టు

కరోనా పేరు చెబితేనే వణికిపోతున్న సమయంలో కొందరు జై కరోనా అంటూ సంబరాలు చేసుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన వారంతా పగలబడి నవ్వుతున్నారు. 

వివరాల్లోకి వెళితే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మార్చ్ 31 వరకు సెలవులను ప్రకటిస్తున్నట్టు ఐఐటీ ఢిల్లీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇలా సెలవులు ప్రాకటించారాన్న సర్క్యూలర్ విడుదలవ్వగానే కారాకొరామ్ హాస్టల్ విద్యార్థులు సెలవులు దక్కాయన్న ఆనందంలో ఇంటికి వెళ్లొచ్చు అనుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. 

ఆసందర్భంగా జై కరోనా జై కరోనా అంటూ సంతోషంలో డ్యాన్సులు కూడా చేసారు. జై కరోనా జై కరోనా నినాదాలతో క్యాంపస్ అంత దద్ధరిల్లింది. రక్షా అగర్వాల్ అనే విద్యార్ధి ఈ వీడియోను ట్వీట్ చేసింది. చావు కూడా భయపెట్టలేదు, కానీ ఎగ్జామ్స్ భయపెట్టగలవు అని ఆ అమ్మాయి ఈ సంధర్భంగా రాసుకొచ్చింది. మొత్తానికి ఎగ్జామ్స్ కాన్సల్ అయ్యాయని మాత్రం స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో చూసినోళ్లు చూసినట్టు నవ్వుతున్నారు.