Asianet News TeluguAsianet News Telugu

అంతరిక్షయానానికి తెలుగు మూలాలున్న యువతి: ఎవరీ శిరీష బండ్ల?

తెలుగు మూలాలు కలిగిన మహిళ తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. జూలై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది.  నలుగురు ఈ అంతరిక్ష వాహక నౌకలో ప్రయాణం చేయనున్నారు. భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడ అంతరిక్షంలోకి ప్రయాణం చేయనున్నారు.

Virgin Galactic to launch Richard Branson on July 11, aiming to beat Jeff Bezos to space
Author
Washington D.C., First Published Jul 2, 2021, 1:18 PM IST

వాషింగ్టన్ : తెలుగు మూలాలు కలిగిన మహిళ తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. జూలై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది.  నలుగురు ఈ అంతరిక్ష వాహక నౌకలో ప్రయాణం చేయనున్నారు. భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడ అంతరిక్షంలోకి ప్రయాణం చేయనున్నారు.

 

వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్వహరాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు.అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గాను వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టనుంది. అంతరిక్షంలోకి పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్ 25న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్స్ జారీ చేసింది. ఈ నెల 11 నుండి మెక్సికో నుండి ఈ స్పేస్ ఫ్లైట్ బయలుదేరనుంది. ఇద్దరు పైలెట్లతో పాటు  వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సస్, మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

ఎవరీ శిరీష బండ్ల?

డాక్టర్ అనురాధ, డాక్టర్ మురళీధర్ రావు కూతురు శిరీష బండ్ల. ఆమె వయస్సు 34 ఏళ్లు. శిరీష తల్లిదండ్రులది ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా.  చాలా ఏళ్ల క్రితమే ఈ కుటుంబం అమెరికాలో స్థిరపడింది.చిన్నతనం నుండి  అంతరిక్షయానం అంటే శిరీష కోరిక. పురుడే యూనివర్శిటీ నుండి ఆమె ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీలో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. గత 13 ఏళ్లుగా ఆమె ఏరోస్పేస్ విభాగంలో పనిచేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios