Asianet News TeluguAsianet News Telugu

వర్జిన్ గెలాక్టిక్ ప్రయాణం ఆలస్యం : కొత్త షెడ్యూల్ ఇదే..!!!

నేడు అంతరిక్షయానికి శిరీష బండ్ల రోదసీ యాత్రకు అమెరికాకు చెండిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక సిద్దమైంది. ఈ వ్యోమనౌకలో తెలుగు మూలాలున్న శిరీష బండ్ల అంతరిక్షయానం చేయనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష పేరేంట్స్ అమెరికాలో స్థిరపడ్డారు.

Virgin Galactic launching late ksp
Author
New Mexico, First Published Jul 11, 2021, 6:29 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక ప్రయాణం గంటన్నర ఆలస్యంకానుంది. వాతావరణ మార్పుల కారణంగా అంతరిక్ష ప్రయాణం ఆలస్యమవుతోంది. ట్విట్టర్ ద్వారా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది వర్జిన్ గెలాక్టిక్. భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి రోదసిలోకి వర్జిన్ గెలాక్టిక్ దూసుకెళ్లనుంది. న్యూమెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌక ప్రయాణిస్తుంది. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న నాలుగో వ్యోమగామి బండ్ల శిరీష ఈ టీమ్‌లో వున్నారు. 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష పేరేంట్స్ చాలా క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. శిరీష ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్  ఆదివారం నాడు మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ -22 ను వీఎంఎన్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుండి 15 వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది. అనంతరం అక్కడి నుండి  రాకెట్ యూనిటీ-22 ను మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది.

Also Read : రోదసీయాత్రకు తెలుగమ్మాయి: నేడు అంతరిక్షయానికి శిరీష బండ్ల

ఈ వ్యోమ నౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు మరో అయిదుగురు ప్రయాణం చేయనున్నారు. ఇందులో శిరీష బండ్ల ఉన్నారు. ఈ యాత్రపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.ఈ అంతరిక్షయానం విజయవంతమైతే  అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష బండ్ల రికార్డు సృష్టించనున్నారు. అంతకుముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోదసీలోకి వెళ్లారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios