Asianet News TeluguAsianet News Telugu

రోదసీయాత్రకు తెలుగమ్మాయి: నేడు అంతరిక్షయానికి శిరీష బండ్ల

రోదసీ యాత్రకు అమెరికాకు చెండిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక సిద్దమైంది. ఈ వ్యోమనౌకలో తెలుగు మూలాలున్న  శిరీష బండ్ల అంతరిక్షయానం చేయనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష పేరేంట్స్ అమెరికాలో స్థిరపడ్డారు.

India Born Sirisha Bandla To Fly On Virgin Galactic Spacecraft Today lns
Author
Washington D.C., First Published Jul 11, 2021, 11:33 AM IST


వాషింగ్టన్: రోదసీ యాత్రకు తెలుగు మూలాలున్న శిరీష బండ్ల ఇవాళ వెళ్లనున్నారు.  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష పేరేంట్స్ చాలా క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. శిరీష ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్  ఆదివారం నాడు మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ -22 ను వీఎంఎన్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుండి 15 వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది. అనంతరం అక్కడి నుండి  రాకెట్  యూనిటీ-22 ను మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది.

also read:అంతరిక్షయానానికి తెలుగు మూలాలున్న యువతి: ఎవరీ శిరీష బండ్ల?

ఈ వ్యోమ నౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు మరో అయిదుగురు ప్రయాణం చేయనున్నారు. ఇందులో శిరీష బండ్ల ఉన్నారు. ఈ యాత్రపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.ఈ అంతరిక్షయానం విజయవంతమైతే  అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష బండ్ల రికార్డు సృష్టించనున్నారు. అంతకుముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోదసీలోకి వెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios