Asianet News TeluguAsianet News Telugu

ఇదేం పిచ్చిపని.. మూడేళ్ల చిన్నారిని పట్టాలమీదికి తోసేసి.. నింపాదిగా కూర్చుంది.. కారణం ఏంటంటే..

ఓ మహిళ మూడేళ్ల చిన్నారిని రైలు పట్టాలమీదికి తోసేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె అలా ఎందుకు చేసిందంటే... 

Viral Video.. Woman seen pushing a 3-year-old girl on railway track in USA
Author
First Published Jan 3, 2023, 7:29 AM IST

వాషింగ్టన్ : ఒక్కోసారి కొంతమంది ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. ఆ పనికి ఏలాంటి లాజిక్ ఉండదు. దాని వల్ల ఎదుటి వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. కాని వారు మాత్రం తాపీగా.. తాము చేసింది పెద్దతప్పేం కాదు అన్నట్లుగా ఉంటారు. అలాంటి షాకింగ్ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై రైలు గురించి ఎదురు చేస్తున్నారు అందరు. తల్లితో పాటు వచ్చిన ఓ మూడేళ్ల చిన్నారి కూడా అక్కడే ఉంది. ఇంతలో అక్కడే ఉన్న ఓ మహిళకు ఏం జరిగిందో ఏమో తెలియదు కాని ఆ చిన్నారిని ఒక్కసారిగా పట్టాల మీదికి తోసింది.  ఆ తర్వాత నింపాదిగా వెళ్లి బెంచి మీద కూర్చుంది.

అమెరికాలోని ఓరెగాన్ లోని పోర్ట్ ల్యాండ్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.  ఘటనకు సంబంధించిన మొత్తం దృశ్యం రైల్వేస్టేషన్లోని సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యింది. ఆ వీడియోను అక్కడి అధికారులు తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన నిరుడు డిసెంబర్ 28న జరిగింది. ఆ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. ఓ మూడేళ్ళ చిన్నారి తల్లితో కలిసి ట్రైన్ ఎక్కడం కోసం స్టేషన్లో నిలుచుంది. ఆ తల్లీకూతుళ్ల వెనక ఉన్న బెంచీమీద కూర్చున్న ఓ మహిళ.. ఒక్కసారిగా చిన్నారిని రైలుపట్టాల మీదికి తోసేసింది. 

మూడు నెలల పసికందును మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసిన తల్లి

ఒక్కనిముషం తల్లికి ఏమీ అర్థం కాలేదు. ఇది చూసిన అక్కడ ఉన్న ప్రయాణికులు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ చిన్నారిని పట్టాల మీద నుంచి కాపాడారు. అయితే చిన్నారిని తోసేసిన తర్వాత ఆ మహిళ నింపాదిగా వెనక్కి వెళ్ళి తన సీట్లో కూర్చోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. చిన్నారి రైలు పట్టాల మీదికి తోసేసిన సమయంలో ఏ రైలు రాకపోవడంతో బాలిక ప్రాణాలకు ఎలాంటి అపాయం జరగలేదు. కానీ ప్లాట్ఫామ్ మీద నుంచి పడడంతో బాలికకు గాయాలయ్యాయి.

ఈ పిచ్చి పనికి పాల్పడిన మహిళను 32 ఏళ్ల బ్రియానా లేస్ వర్క్ మెన్ గా గుర్తించారు. బాలికను పట్టాల మీదికి తోసేసిన తర్వాత.. అసలేమి జరగనట్టు గా తనకేమీ పట్టనట్టు గా ఆమె కూర్చున్న తీరు అక్కడున్న వారిని షాక్ కు గురిచేసింది. ఈ సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని నిందితురాలిని అరెస్టు చేశారు. ముల్ట్ నోమా కౌంటీ డిస్టిక్ అటార్నీ ఆఫీస్ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఆ మహిళ అలా చేయడానికి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వారు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios