షాకింగ్.. అందరూ చూస్తుండగానే మహిళలపై పెరుగుతో దాడి.. బాధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలేం జరిగింది?
హిజాబ్ ధరించలేదని దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వైరల్ అవుతున్న వీడియోలో దాడికి గురైన మహిళలను అరెస్టు చేయాలని ఆదేశించారు.
గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక నిబంధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇస్లాం దేశాల్లో ఈ వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల్లో హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా హిజాబ్ ధరించలేదని దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వైరల్ అవుతున్న వీడియోలో దాడికి గురైన మహిళలను అరెస్టు చేయాలని ఆదేశించారు.
ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం, ఈ సంఘటన ఇరాక్‌లోని మషాద్ నగరంలో జరిగింది. వైరల్ వీడియోలో, ఒక షాప్ కౌంటర్ వద్ద ఇద్దరూ మహిళలను చూడవచ్చు.. వారిద్దరూ తల్లి మరియు కుమార్తె చూడవచ్చు. ఇద్దరూ హిజాబ్ లేకుండా ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, ఇద్దరు స్త్రీలను హిజాబ్ లేకుండా చూస్తాడు. ఇద్దరితో గొడవ పడ్డాడు. వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయాడు. వారిద్దరినీ తిట్టాడు. అయినా అతడి కోపం చల్లారలేదు. తర్వాత పెరుగుతో వారిపై దాడి చేస్తుంది. వారి తలలపై పెరుగు పోస్తారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే నెత్తి మీద పెరుగు పడిపోయింది. వెంటనే స్పందించిన ఆ షాప్ ఓనర్ పెరుగు చల్లిన వ్యక్తిపై దాడి చేశాడు. మహిళలపై పెరుగుతో దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఇద్దరు మహిళలపై అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. హిజాబ్ ధరించనందున ఆ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరి మహిళలను అరెస్ట్ చేశారు. అలాగే.. పెరుగుతో దాడి చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పబ్లిక్ ప్లేస్ లో హిజాబ్‌ను తొలగించడం ద్వారా మహిళలు చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొంది. దీంతో ఇద్దరి మహిళలపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. దాడి చేసిన వ్యక్తిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్లు ఇరాన్ జ్యుడిషియరీ మిజాన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ నివేదించింది. బహిరంగ ప్రదేశంలో కించపరిచే పనికి పాల్పడ్డారని ఆరోపించారు. హిజాబ్ ధరించని మహిళలను షాపులోకి అనుమతించడంతోపాటు ఆ చట్టాన్ని పాటించనందుకు షాపు ఓనర్ కి కూడా నోటీసులిచ్చారు.
హిజాబ్ చట్టాలు
దేశంలో హిజాబ్ ధరించడంపై కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే మహిళలను ప్రాసిక్యూట్ చేస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ బెదిరించిన సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఇలాంటి నీచమైన పనులు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని మొహసేని ఏజేఈ తెలిపారు. వారిపై కనికరం చూపరని హెచ్చరించారు కూడా.
ఇరాన్ పార్లమెంట్ మహిళల డ్రెస్ కోడ్‌కి సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ఏడేళ్ల వయస్సున్న బాలికలతో సహా మహిళలంతా బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. మహిళలు హిజాబ్ ధరించకుంటే.. 49 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే హిజాబ్‌ను వ్యతిరేకిస్తున్న ఆ దేశ మహిళలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.
గతేడాది హిజాబ్ ధరించలేదని మాసా అమీని అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేసి.. పోలీసులు కస్టడీలో తీవ్రంగా గాయపడిన ఆమె చిక్సిత పొందుతూ.. మరణించింది. ఈ ఘటనతో ఇరాన్ లో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. మాసా అమీనికి మద్దతుగా వేలమంది మహిళలు రోడ్లపైకి వచ్చి.. నిరసన వ్యక్తం చేశారు.
భారీ ఎత్తున్న ఆందోళనలు చేపట్టడంతో నైతిక పోలీసు విభాగాలను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, హిజాబ్ నిబంధనను మాత్రం అమల్లోనే ఉంచింది. ఈ క్రమంలో పలు మహిళలు, యువతులు హిజాబ్ ధరించకుండా బయటికి వస్తున్నారు. దీంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.