ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొడుకును యుద్ధ భూమికి పంపారా?.. వైరల్ ఫొటోలో నిజమెంతా?
ఇజ్రాయెల్-హమాస్‌ల యుద్దంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ శనివారం ఉదయం ఒక్కసారి రాకెట్ల వర్షం కురిపించడం.. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగడంతో యుద్దం ప్రారంభమైంది.
ఇజ్రాయెల్-హమాస్‌ల యుద్దంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ శనివారం ఉదయం ఒక్కసారి రాకెట్ల వర్షం కురిపించడం.. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగడంతో యుద్దం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్‌ను మట్టుబెట్టాలనే లక్ష్యంతో ముందకు సాగుతుంది. ఈ క్రమంలోనే రిజర్వ్ ఆర్మీని కూడా రంగంలోకి దించింది. అయితే ఇలాంటి పరిస్థితుల వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడు అవ్నర్ నెతన్యాహును దేశానికి సేవ చేయడానికి పంపుతున్నట్టుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చాలా మంది ఎక్స్(ట్విట్టర్)లో ఈ ఫొటోను షేర్ చేయసాగారు. అయిదే దేశ ప్రధాని.. తన సొంత కొడుకును యుద్దంలో పంపుతున్నారని ఆ పోస్టులో ఉండటంతో ఈ ఫొటో అందరి దృష్టికి ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దేశభక్తిని పలువురు కొనియాడారు. అంతేకాకుండా దీనిని పిక్చర్ ఆఫ్ ది డే అంటూ పలువురు కామెంట్ కూడా చేయసాగారు.
‘‘దేశానికి మొదటి స్థానం ఇవ్వడం. ప్రధాని నెతన్యాహు కొడుకు సైన్యంలో సేవ చేయాలనే నిర్ణయం అతను తన దేశాన్ని తనకంటే ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడని చూపిస్తుంది’’ అని ఆ ఫొటో షేర్ చేస్తూ ఓ నెటిజన్ పేర్కొన్నారు.
అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా షేర్ చేయబడుతున్న ఈ ఫొటో.. ఇప్పటిది కాదని తేలింది. బెంజమిన్ నెతన్యాహు కుమారుడిని హమాస్‌పై యుద్దానికి పంపుతున్నప్పటీ ఫొటో కాదని వెల్లడైంది. ఈ ఫొటో 2014లో తీసిందనే క్లారిటీ వచ్చింది. బెంజమిన్ నెతన్యాహు తన చిన్న కుమారుడు అవ్నర్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)లో అతని సైనిక సేవను ప్రారంభించిన సమయంలో ఈ ఫొటో తీసినట్టుగా వెల్లడైంది.
అయితే అవ్నెర్ యుద్ధ సమయంలో సేవ చేయడానికి దళాలలో చేరాడా లేదా అనే దానిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే ఆ ఫొటో మాత్రం ఇప్పటిది కాదని మాత్రం నిర్దారణ అయింది.