Asianet News TeluguAsianet News Telugu

ఎలన్ మస్క్ ఎఫెక్ట్.... ఆఫీసులోనే నిద్రపోతున్న ట్విట్టర్ ఉద్యోగి...!

కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఇంజనీర్లను రోజుకు 12 గంటలు పనిచేయాలని హుకుం జారీ చేశారు. అదేవిధంగా ఏడు రోజులూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Viral Image Shows Twitter Employee Sleeping On Office Floor
Author
First Published Nov 3, 2022, 9:51 AM IST

ఇటీవల ట్విట్టర్ యాజమాన్యం మారిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ని టెస్లా అధినేత ఎలన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ట్విట్టర్ లో ప్రక్షాళన మొదలుపెట్టాడు. పలువురు కీలక అధికారులను తొలగించాడు. ఉద్యోగులకు సైతం పని గంటల విషయంలో ఆంక్షలు విధించాడు.

కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఇంజనీర్లను రోజుకు 12 గంటలు పనిచేయాలని హుకుం జారీ చేశారు. అదేవిధంగా ఏడు రోజులూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.  ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ లో ఓ ఫోటో వైరల్ గా మారింది.

ఆ ఫోటోలో ట్విట్టర్ లో పని చేస్తున్న ఓ మేనేజర్ ఆఫీసులో పని చేసి చేసి.. ఇంటికి వెళ్లే సమయం లేక.. అక్కడ నిద్రపోయింది. దీనిని ఓ ట్విట్టర్ ఉద్యోగి షేర్ చేయడం గమనార్హం. అంతే... ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది. స్లీపింగ్ బ్యాగ్ లో దూరి.. ఆఫీసులో టేబుల్, చైర్ల వెనక పడుకోవడం విశేషం. ఇంటికి వెళ్లే సమయం కూడా  లేకపోతే ఏం చేస్తారు.. ఇలానే ఉంటుంది మరి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా .. ఈ పోస్టుకి నెటిజన్ల నుంచి రియాక్షన్ కూడా అదిరిపోయింది. కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఇదిలా ఉండగా... నివేదికల ప్రకారం, ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను స్వీకరించడానికి ముందు కంటే ట్విట్టర్ ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. ట్విటర్ నిర్వాహకులు వారానికి ఏడు రోజులు 12 గంటల షిఫ్టులలో పని చేయాలని ఉద్యోగులకు చెబుతున్నట్లు తెలుస్తోంది.

 

ట్విటర్  యూజర్ వెరిఫికేషన్ ప్రక్రియను సరిదిద్దడానికి గడువును పూర్తి చేయడానికి 24/7 పని చేయాల్సిందిగా  మస్క్ ఉద్యోగులను కోరినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక పేర్కొంది.

రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం Twitter 2021 చివరి నాటికి 7,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది . వారిలో చాలా మందిని తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 2వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios