Asianet News TeluguAsianet News Telugu

పెంటగాన్ సమీపంలో కాల్పలు కలకలం..!

దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించారు. పోలీసుబలగాలు ఆ ప్రాంతాతలన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 

Violence reported from outside Pentagon, officer stabbed to death, suspect killed
Author
Hyderabad, First Published Aug 4, 2021, 8:23 AM IST

అమెరికాలోని పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకం రేపాయి.  వాషింగ్టన్ లోని మెట్రో బస్ స్టేషన్ వద్ద దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడినట్లు సమాచారం. కాగా..  ఈ కాల్పులకు తెగబడిన నిందితుడు కూడా చనిపోయినట్లు సమాచారం.

కాగా.. ఈ కాల్పుల ఘనతో అధికారులు అప్రమత్తమయ్యారు.  దీంతో ట్రాఫిక్ ను పెంటగాన్ నగరం వైపు మళ్లించారు. 
అమెరికా మిలటరీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించారు. పోలీసుబలగాలు ఆ ప్రాంతాతలన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 

కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్‌ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దేశంలో గన్స్‌ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్‌ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్‌ కంటే హ్యాండ్‌ గన్స్‌ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios