వీడియోలో ఒక మహిళా ఫ్లైట్ అటెండెంట్ విమానం రెక్కపై నృత్యం చేస్తూ కనపడింది. తర్వాత ఒక మగ సహోద్యోగి కూడా చేరాడు.

సోషల్ మీడియా విపరీతంగా వాడటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ తమను తాము ఎలా ఫేమస్ చేసుకోవాలా అని చూస్తున్నారు. దాని కోసం వింత ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. అందులోనూ చిత్ర విచిత్రాలు చేసి ఫేమస్ అయిపోతున్నారు. కొందరు నిజంగా తమలోని టాలెంట్ చూపిస్తుంటే, కొందరు విరక్తి పుట్టేలా చేసి అయినా సరే ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా విమాన సిబ్బంది ఏకంగా విమానం రెక్కలపై నిల్చొని డ్యాన్సులు వేశారు.

దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముందుగా, వీడియోలో ఒక మహిళా ఫ్లైట్ అటెండెంట్ విమానం రెక్కపై నృత్యం చేస్తూ కనపడింది. తర్వాత ఒక మగ సహోద్యోగి కూడా చేరాడు. సీనియర్ క్యాబిన్ చీఫ్‌గా భావించే రెండో వ్యక్తి కూడా వీడియోలో వివిధ భంగిమల్లో కనిపిస్తాడు. ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది కూడా విమానం ఇంజిన్ ముందు ఫోటో తీయడం కనిపిస్తుంది.

Scroll to load tweet…

ఈ సంఘటన ఈ నెల ప్రారంభంలో జరిగింది. వీడియో వైరల్ గా మారడంతో, ఎయిర్ లైన్స్ సిబ్బంది స్పందించింది. ఎయిర్‌లైన్ అటువంటి ప్రవర్తనకు అనుమతించదు అంటూ ఓ లేఖలో పేర్కొన్నారు. వారిపై చర్యలు కూడా తీసుకున్నట్లు సమాచారం.

స్విస్ ప్రతినిధి మైఖేల్ పెల్జర్, సిబ్బంది చర్యలపై మండిపడ్డారు, బోయింగ్ 777 రెక్కలు సుమారు ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నాయని పేర్కొన్నారు. అటువంటి ఎత్తు నుండి గట్టి ఉపరితలంపై పడటం వలన తీవ్రమైన గాయాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

 సిబ్బందిని తరలించడం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విమానం రెక్కలపై ఉండాలని నొక్కిచెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యపు ప్రవర్తనపై ఆయన సీరియస్ అవ్వడం గమనార్హం.