Asianet News TeluguAsianet News Telugu

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం అరెస్ట్

లోహోర్‌లోని కోట్ లక్‌పత్ జైల్లో ఉన్న తన తండ్రిని కలుసుకునేందుకు మరియం నవాజ్ వెళ్తుండగా అధికారులు అరెస్ట్ చేసినట్టు పాక్ మీడియా తెలిపింది. అయితే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తనంత తానే ఎన్ఏబీ కార్యాలయానికి వెళ్లాలని భావించినప్పటికీ ఈలోగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
Vice president of PMLN and daughter of former PM Nawaz Sharif arrested by NAB team in Lahore
Author
Lahore, First Published Aug 8, 2019, 4:12 PM IST

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్ఎన్ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చౌద్రీ సుగర్ మిల్స్ కేసులో పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

లోహోర్‌లోని కోట్ లక్‌పత్ జైల్లో ఉన్న తన తండ్రిని కలుసుకునేందుకు మరియం నవాజ్ వెళ్తుండగా అధికారులు అరెస్ట్ చేసినట్టు పాక్ మీడియా తెలిపింది. అయితే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తనంత తానే ఎన్ఏబీ కార్యాలయానికి వెళ్లాలని భావించినప్పటికీ ఈలోగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

ఇకపోతే అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో మరియం నవాజ్, ఆమె భర్త, తండ్రి నవాజ్ షరీఫ్ లు జైల్లో గడిపారు. కొద్దినెలల క్రితం ఈ ముగ్గురు జైలు నుంచి విడుదల అయ్యారు. విడుదలైన కొద్దిరోజుల్లోనే అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన లాహోర్ జైల్లో ఉన్నారు. తాజాగా మరియం నవాజ్ ను ఎన్ఏబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios