ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యూఏఈలో మరో కొత్తరకం స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే యూకే, దక్షిణాప్రికా దేశాల్లో వెలుగులోకి వచ్చిన కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా యూఏఈలో మరో కొత్తరకం స్ట్రెయిన్ కేసులు బయటకు రావడం మరింత కలవరానికి గురి చేస్తోంది. 

కాగా, యూఏఈలోనూ యూకే స్ట్రెయిన్ పాకింది. ఈ కేసులను పరిశీలిస్తున్న క్రమంలోనే మరికొన్ని జన్యుమార్పిడిలతో ఈ కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు ఆ దేశ వైద్య నిపుణులు వెల్లడించారు. అయితే, ఇవి అంత డేంజరేమి కాదని, ప్రస్తుతం కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్స, టీకా పద్ధతిని అదే విధంగా కొనసాగిస్తే సరిపోతుందని యూఏఈ నేషనల్ కొవిడ్-19 క్లినికల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్‌పర్సన్ డా. నవల్ అల్ కాబి అన్నారు.

 కాగా, ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి రేటు అధికంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనావైరస్‌లోని ఉత్పరివర్తనలు ఇన్‌ఫ్లుయెంజా వైరస్ మాదిరిగానే ఉంటాయని నవల్ వెల్లడించారు. అలాగే ఆర్ఎన్ఏ వైరస్‌లలో చిన్నపాటి ఉత్పరివర్తనలు ఎంత సాధారణమో ఎస్ఏఆర్ఎస్-CoV-2లో కూడా సర్వసాధారణం అన్నారు.