వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారినపడి సురక్షితంగా బయటపడ్డారు. అయితే తాజాగా ట్రంప్ తనయుడు బారన్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని యూఎస్‌ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ బుధవారం వెల్లడించారు. 

ఇటీవల ట్రంప్ దంపతులు కరోనా నుండి కోలుకున్నారు. దీంతో తాజాగా మరోసారి ఈ కుటుంబం మొత్తానికి పరీక్షలు నిర్వహించగా ఈసారి బారన్ కు పాజిటివ్ గా తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు మెలానియా తెలిపారు.ప్రస్తుతం తన చిన్న కుమారుడు ఇప్పుడు బాగానే ఉన్నాడంటూ ట్రంప్ కూడా బారన్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు.  ప్రస్తుతం అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 

read more  వైట్ హౌజ్ ను వణికిస్తోన్న కరోనా.. ట్రంప్ సీనియర్ ప్రధాన సలహాదారుడికి పాజిటివ్..

కరోనా నుండి కోలుకున్న ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కు చేరుకున్నారు. కరోనా వైరస్ వ్యాధితో వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రిలో చేరిన ఇటీవలే ఆయన డిశ్చార్జీ అయ్యారు. అక్కడ ఆయన నాలుగు రోజుల పాటు చికిత్స పొందారు ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన వైట్ హౌస్ కు చేరుకున్నారు. 

మరో వారం పాటు ఆయనకు వైద్యులు చికిత్స అందించనున్నారు. కోవిడ్ గురించి భయపడవద్దని ట్రంప్ దేశ ప్రజలకు ధైర్యం చెప్పారు. మన జీవితాలపై వైరస్ ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.

వైట్ హౌస్ చేరుకుంటూనే ఆయన మాస్క్ ను తొలగించారు. త్వరలో ప్రచారంలోకి దూకుతానని ఆయన చెప్పారు. వైరస్ కు భయపడవద్దంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన భార్య మెలానియా కూడా కరోనా నుండి కోలుకున్నాడు.