Asianet News TeluguAsianet News Telugu

వైట్ హౌజ్ ను వణికిస్తోన్న కరోనా.. ట్రంప్ సీనియర్ ప్రధాన సలహాదారుడికి పాజిటివ్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  సీనియర్ ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిల్లెర్ కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ బారిన పడిన వైట్ హౌస్ సిబ్బంది సంఖ్య 10కి చేరినట్టు తెలుస్తోంది. ట్రంప్‌తోపాటు హోప్ హిక్స్ తదితరులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్టీఫెన్ మిల్లర్ గత ఐదు రోజులుగా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. మంగళవారం పరీక్ష చేయించుకోగా మిల్లర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. 

Top White House aide Stephen Miller tests positive for Covid - 19  - bsb
Author
Hyderabad, First Published Oct 7, 2020, 12:29 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  సీనియర్ ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిల్లెర్ కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ బారిన పడిన వైట్ హౌస్ సిబ్బంది సంఖ్య 10కి చేరినట్టు తెలుస్తోంది. ట్రంప్‌తోపాటు హోప్ హిక్స్ తదితరులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్టీఫెన్ మిల్లర్ గత ఐదు రోజులుగా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. మంగళవారం పరీక్ష చేయించుకోగా మిల్లర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. 

ఇప్పటికే గత గత ఐదు రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ  రిమోట్ గా విధులు నిర్వహిస్తున్నారు మిల్లెర్. రోజూ కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. రోజూ నెగెటివ్ వచ్చినా మంగళవారం పాజిటివ్ అని నిర్తారణ అయిందని మిల్లెర్ వెల్లడించారు. దీంతో క్వారంటైన్ లోకి వెళుతున్నట్టు పేర్కొన్నారు. 

వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిల్లెర్ భార్య కేటీ మిల్లర్‌కు  గత మే నెలలో  కరోనా సోకింది. ప్రస్థుతం గర్భవతిగా ఉన్న కేటీ మిల్లెర్ సాల్ట్ లేక్ సిటీలో సెనేటర్ కమలాహారిస్, ఉపాధ్యక్షుడు పెన్సు జరిపే చర్చ సన్నాహాల్లో కీలకపాత్ర పోహించారు. కేటీ మిల్లెర్ ఉపాధ్యక్షుడి ట్రావెలింగ్ పార్టీలో ఉన్నారు. 

కాగా ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా నిర్ధారణైన అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు గత వారం కరోనా బారిన పడినట్టు గుర్తంచారు. ఈ మేరకు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ట్రంప్ ఈ  సోమవారం డిశ్చార్జ్‌ అయిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ ఎనానీ, ముగ్గురు సిబ్బంది కూడా పాజిటివ్ వచ్చింది. వైట్ హౌస్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు పాత్రికేయులకు కూడా వైరస్ సోకింది. దీంతో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. పీపీఈ కిట్లను ధరించడం లాంటి జాగ్రత్తలతోపాటు ట్రంప్ కుటుంబంతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్న సిబ్బందికి ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించనున్నారు. 

ప్రస్థుతం కరోనా సోకిన స్టీఫెన్ మిల్లెర్ సెప్టెంబరు 30వతేదీన హైప్ హిక్స్‌తో కలిసి మెరైన్ వన్‌లో ప్రయాణించారు. గత వారం ట్రంప్ చర్చా సన్నాహక సమావేశంలో మిల్లెర్ పాల్గొన్నారు. ట్రంప్ తోపాటు వైట్ హౌస్ అధికారులకు కరోనా సోకుతుండటం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios