ఇటీవలి కాలం విమానాల్లో ప్రయాణిస్తున్నవారిలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు చాలా అసభ్యకరంగా ఉంటుంది. వారి చేష్టలతో విమానంలో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నారు.

ఇటీవలి కాలం విమానాల్లో ప్రయాణిస్తున్నవారిలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు చాలా అసభ్యకరంగా ఉంటుంది. వారి చేష్టలతో విమానంలో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి అసభ్యకరమైన మరొకటి వెలుగుచూసింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక భారతీయ-అమెరికన్ డాక్టర్.. మైనర్ బాలిక పక్కన హస్తప్రయోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆ డాక్టర్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అమెరికాలో అరెస్టు చేసింది. 

ఆ వ్యక్తిని డాక్టర్ సుదీప్త మొహంతిగా గుర్తించారు. అయితే విచారణ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలను సుదీప్త మొహంతి ఖండించారు. ‘‘నాకు సంఘటన గురించి గుర్తు లేదు’’ అని ఆయన చెప్పారు. 

యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం ప్రకారం.. ఈ సంఘటన గత ఏడాది మేలో హోనోలులు నుంచి బోస్టన్ వెళ్లే విమానంలో జరిగింది. మసాచుసెట్స్‌కు చెందిన డాక్టర్ సుదీప్త మొహంతిని గురువారం అరెస్టు చేశారు. ‘‘యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్ అధికార పరిధిలో ఉన్నప్పుడు అసభ్యకరమైన, అశ్లీల చర్యలకు పాల్పడినట్లు’’ అభియోగాలను అతడిపై మోపారు.

పత్రికా ప్రకటన ప్రకారం.. బోస్టన్‌లోని బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్‌లో ప్రైమరీ కేర్ ఫిజిషియన్ అయిన డాక్టర్ మొహంతి.. ఒక మహిళా సహచరురాలితో కలిసి ప్రయాణిస్తున్నారు. అతడు ప్రయాణ సమయంలో 14 ఏళ్ల వయస్సు గల ఒక బాలిక పక్కన కూర్చున్నాడు. ఆ బాలిక తన గ్రాండ్‌ పెరేంట్స్‌తో కలిసి ట్రావెల్ చేస్తుంది. 

విమానం ప్రయాణం మధ్యలో ఉన్న సమయంలో.. డాక్టర్ మొహంతి తన మెడ వరకు దుప్పటితో కప్పుకున్నాడు. అయితే అతని కాలు పైకి, కిందకు కదలడాన్ని బాలిక గమనించింది. కొంతసేపటికి.. దుప్పటి నేలపై ఉందని, మొహంతీని కవర్ చేయలేకపోయిందని.. అతడు హస్తప్రయోగం చేసుకుంటున్నాడని బాలిక గమనించింది. దీంతో బాలిక విమానంలో ఖాళీగా ఉన్న మరో సీటుకు మారింది.

ఇక, బోస్టన్‌లో దిగిన తర్వాత, బాలిక ఈ సంఘటన గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. డాక్టర్ మొహంతి విచారణ సందర్భంగా ఆరోపణలను ఖండించారు. ‘‘నాకు సంఘటన గురించి జ్ఞాపకం లేదు’’ అని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి డాక్టర్ మొహంతి గురువారం ఫెడరల్ కోర్టుకు హాజరయ్యారు. అయితే అతనిపై మోపబడిన అభియోగానికి గరిష్టంగా 90 రోజుల జైలు శిక్ష, ఒక సంవత్సరం వరకు పర్యవేక్షించబడిన విడుదల, 5,000 డాలర్ల వరకు జరిమానా విధించబడుతుంది. అయితే నివేదికల ప్రకారం.. 18 ఏళ్లలోపు వ్యక్తులు, వారు గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటి షరతులతో అతను తన వ్యక్తిగత గుర్తింపుపై విడుదల చేయబడ్డారు.