ఆత్మహత్య చేసుకొని తాను చనిపోయినట్లు భార్యను నమ్మించి.. మరో పట్టణంలో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. చివరకు అతను అడ్డంగా భార్యకు దొరికిపోయాడు.

ఓ వ్యక్తి భార్య ను వదిలించుకొని.. తన ప్రియురాలితో ఆనందంగా గడపాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఏకంగా తాను చనిపోయినట్లు నమ్మించాడు. ఆత్మహత్య చేసుకొని తాను చనిపోయినట్లు భార్యను నమ్మించి.. మరో పట్టణంలో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. చివరకు అతను అడ్డంగా భార్యకు దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

View post on Instagram


కాలిఫోర్నియాకు చెందిన అనెస్సా రోస్సీ అనే మహిళ కు వివాహమైంది. అయితే తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి ఈ క్రమంలో వారు ఐదు నెలలపాటు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆమె భర్త చనిపోయాడని ఆమె భావించింది. అయితే... చాలా కాలం తర్వాత ఆమె తెలుసుకున్న విషయం ఏమిటంటే... తన భర్త మెక్సికో నగరంలో.. మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడు. ఆ విషయం జీర్ణించుకోవడానికి ఆమె చాలా కష్టమైంది. అందుకే ఈ విషయాన్ని ఆమె టిక్ టాక్ వీడియో ద్వారా తన బాధంతా షేర్ చేసింది. కాగా... ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

తాము విడిపోవడంతో.. తన భర్త అంత్యక్రియలకు కూడా అప్పుడు తనను అనుమతించలేదని ఆమె చెప్పింది. తన భర్త తనను ఇంత దారుణంగా మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.