Asianet News TeluguAsianet News Telugu

టెక్కీలకు మరో అవకాశం.. హెచ్1బీ వీసా రెండోసారి లాటరీ..!

. ఈ రూపంలో టెక్కీలకు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎజెన్సీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో హెచ్ 1 బీ వీసా కోసం అప్లై చేసినవారికి మరో ఛాన్స్ ఇచ్చారు. 

US To Conduct Rare 2nd Lottery For H-1B Visa Applicants
Author
Hyderabad, First Published Jul 31, 2021, 10:54 AM IST

అమెరికా వెళ్లి.. రూపాయల్లో ఉన్న సంపాదనను డాలర్లలోకి మార్చుకోవాలని కలలు కనే టెక్కీలు చాలా మంది ఉంటారు. అందుకోసం ప్రతి సంవత్సరం ఎంతో మంది వీసా దక్కించుకునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే.. లాటరీ రూపంలో తీసే ఈ వీసా కొందరికి వెంటనే లభిస్తే.. కొందరికి మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించినా పిక్ అవ్వదు.

కాగా.. ఈ రూపంలో టెక్కీలకు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎజెన్సీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో హెచ్ 1 బీ వీసా కోసం అప్లై చేసినవారికి మరో ఛాన్స్ ఇచ్చారు.  లాటరీ పిక్ అవ్వాని వారికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి లాటరీ పద్ధతిని ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన హెచ్​1బీ లాటరీ విధానంలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున జూలై 28న మరికొందరిని ర్యాండమ్​ సెలక్షన్​ ప్రాసెస్​లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగస్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్​ ఫైలింగ్​ ప్రక్రియ నవంబర్​ 3 తో ముగియనున్నట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది.

ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరం 2020 అక్టోబర్​ నుంచి 2021 సెప్టెంబర్​ 30 కాలానికి గాను హెచ్​1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందిని లాటరీ విధానంలో ఎంపిక చేశారు. అయితే మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయారు. కాబట్టి, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహించాలని యూఎస్​సీఐఎస్​ నిర్ణయించింది. తద్వారా అదనంగా వందల మంది టెక్కీలకు హెచ్​1 బీ వీసా దక్కే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రధానంగా స్టెమ్​–ఓపీటీ విద్యార్థులకు భారీ ఊరటగా చెప్పవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios